ఏపీలో కాస్త తగ్గిన కరోనా జోరు: కొత్తగా 17,188 కేసులు.. చిత్తూరులో అదే తీవ్రత

Siva Kodati |  
Published : May 07, 2021, 08:06 PM IST
ఏపీలో కాస్త తగ్గిన కరోనా జోరు: కొత్తగా 17,188 కేసులు.. చిత్తూరులో అదే తీవ్రత

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కాస్తంత నెమ్మదించింది. గడిచిన కొన్నిరోజులుగా రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్న చోట ఈ వేళ స్వల్పంగా  తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 17,188 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 12,45,374కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 73 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 8,519కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విశాఖపట్నం 10, విజయనగరం 11, అనంతపురం 2, తూర్పుగోదావరి 8, ప్రకాశం 4, పశ్చిమ గోదావరి 5, చిత్తూరు 7, గుంటూరు 6, కర్నూలు 5, నెల్లూరు 4, కృష్ణ 6, శ్రీకాకుళం నలుగురు చొప్పున మరణించారు.

నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 12,749 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 10,50,160కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 1,00,424 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,71,60,870కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,86,695 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 1779, చిత్తూరు 2260, తూర్పుగోదావరి 1823, గుంటూరు 1515, కడప 620, కృష్ణ 780, కర్నూలు 1342, నెల్లూరు 1530, ప్రకాశం 385, శ్రీకాకుళం 1632, విశాఖపట్నం 1868, విజయనగరం 749, పశ్చిమ గోదావరిలలో 905 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

PREV
click me!

Recommended Stories

Reddappagari Madhavi Reddy Satirical Comments On YSRCP Party | Asianet News Telugu
School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?