మూఢనమ్మకం : పెళ్లైన 42 రోజులకే భార్యను అతికిరాతకంగా చంపిన భర్త.. కాళ్లకు తాడు కట్టి.. ఛాతిపై వాతలు పెట్టి..

Published : Dec 18, 2021, 10:49 AM IST
మూఢనమ్మకం : పెళ్లైన 42 రోజులకే భార్యను అతికిరాతకంగా చంపిన భర్త.. కాళ్లకు తాడు కట్టి.. ఛాతిపై వాతలు పెట్టి..

సారాంశం

పెళ్లయిన 42 రోజులకే నవ వధువు మృత్యుఒడికి చేరుకుంది. కట్టుకున్న భర్తే కాలయముడిగా మారి కిరాతకంగా చంపేశాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  జీవీఎంసీ నాలుగో వార్డు పుక్కళ్లపాలేనికి చెందిన మైలపిల్లి తగరపువలస వలందపేటకు చెందిన కోనాడ నరసయ్యమ్మ (26)కు 42 రోజుల కిందట వివాహం జరిగింది. పెళ్లైన వారం రోజులకే హరి అదే వార్డు పరిధి చేపలుప్పాడ సమీపంలోని  గోవుపేటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు.    

కొమ్మాది : ఎన్నో ఆశలతో అత్తవారింట అడుగు పెట్టింది ఓ యువతి. అప్పటివరకు అపరిచితుడైనా.. జీవితాంతం కలిసి ఉంటానని marriageలో భర్త చేసిన ప్రమాణాలను గుడ్డిగా నమ్మింది. కొత్త పెళ్లి మురిపం ఇంకా తీరనేలేదు. భర్త గురించి భార్య, భార్య గురించి భర్త ఇంకా పూర్తిగా తెలుసకోనే లేదు. అంతలోనే ఆమె భర్త చేతిలో అతి దారుణంగా murderకు గురయ్యింది. 

పెళ్లయిన 42 రోజులకే నవ వధువు మృత్యుఒడికి చేరుకుంది. కట్టుకున్న భర్తే కాలయముడిగా మారి కిరాతకంగా చంపేశాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  జీవీఎంసీ నాలుగో వార్డు పుక్కళ్లపాలేనికి చెందిన మైలపిల్లి తగరపువలస వలందపేటకు చెందిన కోనాడ నరసయ్యమ్మ (26)కు 42 రోజుల కిందట marriage జరిగింది. పెళ్లైన వారం రోజులకే హరి అదే వార్డు పరిధి చేపలుప్పాడ సమీపంలోని  గోవుపేటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు.  నగరంలో ఓ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

నాటు వైద్యం చేయిస్తానని తీసుకెళ్లి.. మైనర్ బాలికతో బలవంతంగా వ్యభిచారం.. ఆరోగ్యం క్షీణించడంతో...

అయితే ఏమైందో తెలియదు.. కానీ నరసయమ్మ శుక్రవారం ఉదయం విగతజీవిగా కనిపించింది. తగరపువలసలో ఉంటున్న తన అన్నయ్య కోనాడ అప్పారావుతో ఆమె రోజు ఫోన్ లో మాట్లాడుతుండేది. శుక్రవారం ఉదయం నుంచి అప్పారావు ఆమెకు ఫోన్ చేస్తున్నా స్పందించకపోవడంతో అనుమానం వచ్చి.. అతను మధ్యాహ్నం నరసయమ్మ ఇంటికి వచ్చేసరికి తన చెల్లి విగతజీవిగా పడి ఉంది. దీంతో హరిని నిలదీయగా ఎటువంటి సమాధానం చెప్పకపోవడంతో భీమిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

కాళ్లకు తాడు కట్టి…
నరసయమ్మ శుక్రవారం ఉదయమే చనిపోయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శరీరంపై ఉన్న గాయాలను బట్టి  ఆమెది హత్యగానే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాళ్లకు తాడు కట్టి ఛాతిపై వాతలు పెట్టి, మెడకు తాడు కట్టి హత్య చేసినట్లు పోలీసుల పరిశీలనలో తేలింది.  సీఐ వెంకటరమణ, ఎస్సై రాంబాబు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

ప్రకాశం : ట్రాక్టర్‌ బోల్తా.. ఒకరి మృతి, 15 మందికి గాయాలు.. బాధితులంతా విద్యార్ధులే

మూఢనమ్మకాలతో నే..?
హరికి superstitiousపై ఆసక్తి ఎక్కువ అని, జరిగినది.. జరగబోయేదీ చెబుతాను అంటూ ఏవో మంత్రాలు, తంత్రాలు వంటివి వేస్తాడని స్థానికులు చెబుతున్నారు. అలాగే భార్య విషయంలోనూ అతను ఏదో మూఢనమ్మకం ఉండి ఉంటుందని.. ఆ మూఢనమ్మకాలలో భాగంగానే నరసయ్యమ్మను చిత్రహింసలకు గురిచేసి చంపి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. ఆమె మరణం విని తండ్రి దుర్గయ్య విలపించిన తీరు అందరినీ కన్నీళ్లు పెట్టించింది. దుర్గయ్యకు ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుళ్లు.  కాగా నరసయమ్మ చివరి కుమార్తె.  ఆయన భార్య గతంలోనే చనిపోయింది. పెళ్లై ఆనందంగా ఉందని భావించిన తన కూతురు ఇలా హత్యకు గురవుతుందని ఊహించలేదని దుర్గయ్య వాపోయాడు. 
 

PREV
click me!

Recommended Stories

పోలవరం ప్రాజెక్ట్ పనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు | CM Chandrababu Reviews Polavaram Project Works
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ | AP State Food Commission Chairman