రాజధాని కోసం కాదు.. రియల్ ఎస్టేట్ కోసం, అదో పనికిమాలిన సభ: రైతుల పాదయాత్రపై వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Dec 17, 2021, 9:38 PM IST

చంద్రబాబు (chandrababu naidu) అమరావతిలోనే రాజధాని ఎందుకు ఉంచాలి అంటున్నారో చెప్పాలని వైసీపీ (ysrcp) ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ డిమాండ్ చేశారు. అది రాష్ట్ర రాజధాని కోసం చేసిన పాదయాత్ర కాదు రియల్ ఎస్టేట్ కోసం చేసిన పాదయాత్ర అంటూ (nyayasthanam to devasthanam padayatra ) ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు


అమరావతి (amaravathi) కూడా ఆంధ్రప్రదేశ్‌కు ఒక రాజధాని అన్నారు వైసీపీ (ysrcp) ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ (gudivada amarnath) . శుక్రవారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయాలనే జగన్ మూడు రాజధానులు (ap three capitals) తీసుకువచ్చారని తెలిపారు. చంద్రబాబు (chandrababu naidu) అమరావతిలోనే రాజధాని ఎందుకు ఉంచాలి అంటున్నారో చెప్పాలని అమర్‌నాథ్ డిమాండ్ చేశారు. అది రాష్ట్ర రాజధాని కోసం చేసిన పాదయాత్ర కాదు రియల్ ఎస్టేట్ కోసం చేసిన పాదయాత్ర అంటూ (nyayasthanam to devasthanam padayatra ) ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. భూములకు రేట్లు కోసం పాదయాత్ర చేస్తున్నారని అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు. 

ఉద్యమం చేస్తున్నవారు, ఉద్యమాన్ని నడిపిస్తున్నవారు అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులేనని... చంద్రబాబు ఆలోచనలను రాష్ట్ర ప్రజలపై రుద్దుతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌కు (pawan kalyan) ఒక స్టాండ్ లేదని .. ఆయన ఎక్కడికి వెళ్తే అదే రాజధాని అంటారంటూ దుయ్యబట్టారు. గతంలో అమరావతి ఒక స్కామ్ అన్న బీజేపీ నాయకులు ఇప్పుడు మద్దతు తెలుపుతున్నారని అమర్‌నాథ్ మండిపడ్డారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలు కలిగిన వామపక్ష పార్టీలు క్యాపిటలిస్టులకు మద్దతు తెలపడం దారుణమన్నారు. 

Latest Videos

undefined

Also Read:ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం.. మంత్రి Perni Nani ద్వజం

రానున్న రోజులలో మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో జగన్ ప్రెవేశపెడతారని అమర్‌నాథ్ స్పష్టం చేశారు. ఈ బిల్లుకు రాష్ట్ర ప్రజలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారని.. భూములు కాపాడటం కోసం, భూముల రేట్లు పెంచడం కోసం పాదయాత్ర చేశారని ఆయన ఆరోపించారు. తిరుపతిలో జరిగింది ఒక పనికిమాలిన సభ అంటూ గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు

పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు (adeep raj )మాట్లాడుతూ.. చంద్రబాబు రాజధాని విషయంలో ఎన్ని డ్రామాలు వేస్తున్నారో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తల్లి పాలు త్రాగి రొమ్ము గుద్దే విధంగా ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు వ్యవరిస్తున్నారని అదీప్ రాజు మండిపడ్డారు. మంచి మనస్సు ఉన్న ప్రజలు ఉత్తరాంధ్రలో ఉన్నారని.. ఉత్తరాంధ్రకు మోసం జరుగుతుంటే టీడీపీ నాయకులు ప్రశ్నించకపోవడం దారుణమన్నారు. స్థానిక సంస్థలు ఎన్నికల ఫలితాల ద్వారా మూడు రాజధానులకు ప్రజలు మద్దతు తెలియజేశారని అదీప్ రాజు గుర్తుచేశారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు. ఉత్తరాంధ్ర అభివృద్ది జగన్‌తోనే సాధ్యమన్న ఆయన త్వరలోనే అసెంబ్లీలో మూడు రాజధానులు బిల్లు ప్రెవేశపెడతారని స్పష్టం చేశారు. 

click me!