చెట్టెక్కి కూర్చొన్న చిరుత: హడలెత్తుతున్న అంకంపాలెం

Published : Feb 04, 2019, 05:37 PM IST
చెట్టెక్కి కూర్చొన్న చిరుత: హడలెత్తుతున్న అంకంపాలెం

సారాంశం

తూర్పుగోదావరి జిల్లా అంకంపాలెంలో  చిరుత కలకలం సృష్టించింది

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా అంకంపాలెంలో  చిరుత కలకలం సృష్టించింది. గ్రామంలోని ముగ్గురుపై దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. మరోవైపు చిరుతను బంధించేందుకు అధికారులు రంగంలోకి దిగారు.

అంకంపాలెంట్ గ్రామంలోకి చిరుతపులి వచ్చింది. ఈ చిరుతను గమనించన ముగ్గురిపై చిరుత దాడి చేసింది. చిరుత దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.గ్రామంలో ప్రవేశించిన చిరుతను బంధించేందుకు అటవీశాఖాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

గ్రామంలోని  ఓ కొబ్బరిచెట్టు మీదకు చిరుతపులి కూర్చొంది.అటవీ ప్రాంతం నుండి అంకంపాలెం గ్రామ సమీపంలోని లంక గ్రామాల్లోకి వచ్చినట్టుగా అటవీశాఖాధికారులు అభిప్రాయపడుతున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్