తేల్చుకుందామా...!దమ్ముంటే చర్చకు రండి : అమిత్ షా కు టీడీపీ కౌంటర్

By Nagaraju penumalaFirst Published Feb 4, 2019, 6:10 PM IST
Highlights

ఈ అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టైం, ప్లేస్ చెప్తే తాము చర్చకు వస్తామన్నారు. విభజన హామీలను అమలు చేయకుండా బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని ఘాటుగా విమర్శించారు. గుజరాత్‌కు పోటీ వస్తుందనే ఏపీపై కక్షగట్టారని ఆరోపించారు. 

అమరావతి: బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్ కౌంటర్ ఇచ్చారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేశామని చెప్తున్న అమిత్ షా దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. 

శ్రీకాకుళం జిల్లా సత్యమేవ జయతే ప్రజాచైతన్య యాత్ర బస్సుయాత్రను ప్రారంభించిన అమిత్ షా విభజన చట్టంలోని 14 హామీలలో 10 పూర్తి చేశామని అలాగే చట్టంలోలేని అనేక సంస్థలను ఏపీకి ఇచ్చినట్లు తెలిపారు. 

ఈ అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టైం, ప్లేస్ చెప్తే తాము చర్చకు వస్తామన్నారు. విభజన హామీలను అమలు చేయకుండా బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని ఘాటుగా విమర్శించారు. గుజరాత్‌కు పోటీ వస్తుందనే ఏపీపై కక్షగట్టారని ఆరోపించారు. 

వైసీపీతో కలిసి బీజేపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతూ ఏపీ గొంతు కోసిందని కళా వెంకట్రావ్ ధ్వజమెత్తారు. మరోవైపు అమిత్ షా పర్యటనకు జనాలు కరువయ్యారని విమర్శించారు. బస్సుయాత్ర వద్ద బహిరంగ సభ అని ప్రకటించిన బీజేపీ జనాలు లేకపోవడంతో అమిత్ షా కేవలం బస్సుపై నుంచే మాట్లాడారని ఎద్దేవా చేశారు. 

అమిత్ షా సభకు జనాలు రాకపోవడంతో బీజేపీ నేతలు తీవ్రనిరాశలో ఉన్నారని అందువల్లే తమపై బురద జల్లుతున్నారని మంత్రి కళా వెంకట్రావ్ ఆరోపించారు. 

click me!