కర్నూలు జిల్లాలో హనీట్రాప్.. చాటింగ్, వీడియో కాల్స్‌తో వల.. ఎదురు తిరిగితే కేసు పెడతానని బెదిరింపులు..

Published : Aug 21, 2022, 10:10 AM IST
 కర్నూలు జిల్లాలో హనీట్రాప్.. చాటింగ్, వీడియో కాల్స్‌తో వల.. ఎదురు తిరిగితే కేసు పెడతానని బెదిరింపులు..

సారాంశం

కర్నూలు జిల్లాలో యువకులను ట్రాప్‌లో వేస్తున్న కిలాడీ లేడీ.. ఎదురు తిరిగినవారిపై అత్యాచారం కేసులు పెడతానని బెదిరింపులకు పాల్పడుతుంది. అయితే  బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  

కర్నూలు జిల్లాలో హనీట్రాప్ వ్యవహారం వెలుగుచూసింది. యువకులను ట్రాప్‌లో వేస్తున్న కిలాడీ లేడీ.. ఎదురు తిరిగినవారిపై అత్యాచారం కేసులు పెడతానని బెదిరింపులకు పాల్పడుతుంది. అయితే  బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఓ మహిళ చాటింగ్, వీడియో కాల్స్‌ ద్వారా యువకులతో పరిచయం పెంచుకుంటుంది. తన స్వీట్ వాయిస్‌తో యువకులను ఆకర్షించి వారి వద్ద నుంచి అప్పులు తీసుకుంటుంది. తర్వాత తీసుకున్న అప్పు చెల్లించమంటే బెదిరింపులకు పాల్పడుతుంది. 

రికార్డు చేసిన వీడియోలను యువకుల స్నేహితులకు పంపుతానంటూ బెదిరింపులకు దిగుతుంది. ఎదురు తిరిగిన వారిపై అత్యాచారం కేసులు పెడతానని బెదిరింపులకు దిగుతుంది. ఈ క్రమంలోనే కిలాడీ లేడీ బాధితులు కొందరు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రభుత్వ ఆస్పత్రి ఉద్యోగి ఒకరు కూడా కిలాడీ లేడీ ట్రాప్‌లో పడినట్టుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే