జగన్ కీలక నిర్ణయం.. ఏపీలో బీసీ- డీ కేటగిరీలోకి మున్నూరు కాపులు

Siva Kodati |  
Published : Aug 20, 2022, 09:23 PM IST
జగన్ కీలక నిర్ణయం.. ఏపీలో బీసీ- డీ కేటగిరీలోకి మున్నూరు కాపులు

సారాంశం

మున్నూరు కాపులను బీసీ- డీ కేటగిరీలోకి చేరుస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ నుంచి ఏపీలో విలీనమైన 7 మండలాల్లో మున్నూరు కాపుల సంఖ్య అధికంగా వుంది. 

మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారిని బీసీలుగా గుర్తిస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు.. మున్నూరు కాపులను బీసీ- డీ కేటగిరీలోకి చేర్చుతున్నట్లు తెలిపింది. ఇకపై వీరికి బీసీ- డీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయనుంది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ మేరకు శనివారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ నుంచి ఏపీలో విలీనమైన 7 మండలాల్లో మున్నూరు కాపుల సంఖ్య అధికంగా వుంది. వీరిని కాపులుగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు తమను బీసీలుగా గుర్తించాలని సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరారు. దీనిపై స్పందించిన ఆయన.. అందుకు తగినట్లుగా ఆదేశాలు ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

ప్ర‌ధాని మోదీతో గంట‌న్న‌ర స‌మావేశ‌మైన సీఎం చంద్ర‌బాబు.. ఏం మాట్లాడ‌రంటే.?
Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం