సీమకు కృష్ణా నికర జలాలు ఇవ్వాలి.. లేకుంటే ఢిల్లీలో పోరాటం: జగన్ సర్కార్‌కు బాలయ్య అల్టీమేటం

Siva Kodati |  
Published : Oct 17, 2021, 03:47 PM IST
సీమకు కృష్ణా నికర జలాలు ఇవ్వాలి.. లేకుంటే ఢిల్లీలో పోరాటం: జగన్ సర్కార్‌కు బాలయ్య అల్టీమేటం

సారాంశం

గోదావరి, పెన్నా నదుల అనుసంధానం జరగాలని.. సీమ కోసం నికర జలాలను వినియోగించాలని సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. కృష్ణా జలాల పరిరక్షణ కోసం పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. సీమకు జలాల కోసం హర్యానా తరహా పోరాటం చేస్తామని..అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఉద్యమిస్తామని బాలకృష్ణ వెల్లడించారు.  

ఒకనాటి రతనాల సీమ నేడు కరువు సీమగా (rayalaseema) మారిపోయిందని అన్నారు సినీనటుడు, హిందూపురం (hindupur mla ) టీడీపీ (tdp) ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (nandamuri balakrishna) . ఈ ప్రాంతం అభివృద్ధికి ఎన్టీఆర్ ఎంతగానో కృషి చేశారని చెప్పుకొచ్చారు. అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన రౌంట్ టేబుల్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రభుత్వానికి హంద్రీనీవా (handri neeva sujala sravanthi)  నుంచి కనీసం చెరువులకు నీరు అందించే ఆలోచన కూడా లేదని బాలయ్య విమర్శించారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతూ నీరు ఇచ్చే పరిస్ధితి లేకుండా చేస్తున్నారని బాలకృష్ణ మండిపడ్డారు. గోదావరి, పెన్నా నదుల అనుసంధానం జరగాలని.. సీమ కోసం నికర జలాలను వినియోగించాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల పరిరక్షణ కోసం పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. సీమకు జలాల కోసం హర్యానా తరహా పోరాటం చేస్తామని..అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఉద్యమిస్తామని బాలకృష్ణ వెల్లడించారు. 

కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (ap cm)  వైఎస్ జగన్‌కు (ys jagan) శనివారం ప్రకాశం జిల్లా (prakasam district) టీడీపీ (tdp) ఎమ్మెల్యేలు మరో లేఖ రాశారు. తమ జిల్లా సమస్యలపై మీకు శ్రద్ధ లేదని వారు ఆరోపించారు. తాము గతంలో రాసిన లేఖల్లో రాజకీయాన్ని వెతికారంటూ జగన్‌పై మండిపడ్డారు. ట్రిపుల్ ఐటీ (III IT)శాశ్వత భవనం ఎక్కడ..? యూనివర్సిటీ నిర్మాణం ఎప్పుడు.. రామాయపట్నం (ramayapatnam port) పోర్టుని ఎందుకు దారి మళ్లిస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. నిత్యావసర వస్తువులు, విద్యుత్ బిల్లులు పెంచేశారని ... ఇప్పుడు కూడా ఇంకా సంక్షేమం అని ఎలా అంటారు అని టీడీపీ నేతలు మండిపడ్డారు. గెజిట్ నోటిఫికేషన్ (gazette notification) అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో సీఎం జగన్‌కు ప్రకాశం జిల్లా నేతల లేఖ సంచలనం సృష్టించింది. 

Also Read:మా లేఖల్లో రాజకీయం వెతికారు.. జిల్లాపై ఏమాత్రం శ్రద్ధ లేదు: జగన్‌కు ప్రకాశం టీడీపీ ఎమ్మెల్యేల లేఖ

అంతకుముందు ఆగస్టు 24న కూడా ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు జగన్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లా స్వప్నం వెలిగొండ ప్రాజెక్ట్ అని (pula subbaiah veligonda project) లేఖలో అన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య (krmb) బోర్డుకు తెలంగాణ సర్కార్ (telangana govt( లేఖ రాసిందని టీడీపీ నేతలు గుర్తుచేశారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ను గెజిట్‌లో చేర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఎద్దేవా చేశారు. కేంద్రంతో మాట్లాడి ప్రాజెక్ట్‌ను గెజిట్‌లో చేర్పించాలని కోరుతున్నామన్నామని టీడీపీ నేతలు లేఖలో పేర్కొన్నారు. గెజిట్‌లో చేర్చకుంటే వెలిగొండ ప్రాజెక్ట్ ప్రశ్నార్థకం అవుతోందని .. ఉమ్మడి ఏపీలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతం ప్రకాశం జిల్లా అని వారు గుర్తుచేశారు. కరువు కాటకాలతో ప్రకాశం జిల్లా ఎడారిగా మారుతోందని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్