వైవీ సుబ్బారెడ్డి ఆదేశాలు చెల్లవ్, అఫిడవిట్ దాఖలు చేయండి: బ్రేక్ దర్శనాలపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Jul 15, 2019, 3:18 PM IST
Highlights

బ్రేక్ దర్శనాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నిర్ణయం తీసుకున్నారంటూ స్టాండింగ్ కౌన్సిల్ స్షష్టం చేసింది. బోర్డు ఏర్పాటు కాకుండా చైర్మన్ నిర్ణయం తీసుకోవడం చెల్లదని స్పష్టం చేసింది. బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఏదైనా జీవో ఉందా అంటూ ప్రశ్నించింది. జీవో లేదా ఆర్డర్ లేకుంటే లిఖితపూర్వకంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆధారాలు ఉండాలని సూచించింది. 
 
అమరావతి: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో స్పెషల్ దర్శనాలపై హైకోర్టులో ఆసక్తికర చర్చ జరిగింది. ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలపై టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ వివరణ కోరింది హైకోర్టు. కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది. 

బ్రేక్ దర్శనాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నిర్ణయం తీసుకున్నారంటూ స్టాండింగ్ కౌన్సిల్ స్షష్టం చేసింది. బోర్డు ఏర్పాటు కాకుండా చైర్మన్ నిర్ణయం తీసుకోవడం చెల్లదని స్పష్టం చేసింది. బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఏదైనా జీవో ఉందా అంటూ ప్రశ్నించింది. జీవో లేదా ఆర్డర్ లేకుంటే లిఖితపూర్వకంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆధారాలు ఉండాలని సూచించింది. 

మరోవైపు ప్రోటోకాల్ దర్శనాలను పేర్లు మార్చి వీఐపీ దర్శనాలు అంటూ తీసుకువస్తున్నారంటూ పిటీషనర్ వాదించారు. తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని పిటీషనర్ వాదించారు. 

పిటీషనర్ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. ఈ నేపథ్యంలో బ్రేక్ దర్శనాలపై పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలంటూ హైకరోర్టు టీటీడీ స్టాండింగ్ కమిటీని ఆదేశించింది. అనంతరం కేసు విచారణను గురువారంకు వాయిదా వేసింది. 

click me!