మావోయిస్టుల సమస్యపై కేబినెట్ సబ్ కమిటీ: జగన్ సర్కార్ నిర్ణయం

Published : Jul 15, 2019, 03:18 PM ISTUpdated : Jul 15, 2019, 03:21 PM IST
మావోయిస్టుల సమస్యపై కేబినెట్ సబ్ కమిటీ: జగన్ సర్కార్ నిర్ణయం

సారాంశం

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొంది. మావోయిస్టుల సమస్యలపై ఏపీ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది.  

అమరావతి: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొంది. మావోయిస్టుల సమస్యలపై ఏపీ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది.

సోమవారం నాడు ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మావోయిస్టుల నియంత్రణ, మావోయిస్టులతో లింక్ ఉన్న సమస్యలపై ఈ కేబినెట్ సబ్ కమిటీ చర్చించనుంది.    ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చైర్మెన్ గా ఉంటారు. ఈ కమిటీలో సభ్యులుగా హోం మంత్రి, గిరిజన, రెవిన్యూ,  ఆర్ అండ్ బి మంత్రులకు చోటు కల్పించారు.

లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించడంతో పాటు మావోల దాడుల్లో దెబ్బతిన్న ఆస్తులకు పునర్నిర్మించడం తదితర విషయాలపై కమిటీ చర్చించనుంది. 
 

PREV
click me!

Recommended Stories

ఒంగోలు పర్యటనలో లోకేష్ ఫాన్స్ ఫాలోయింగ్ చూడండి | Nara Lokesh Ongole Tour
ఏపీ గ్రీన్ కమిటీ ఛైర్మన్‌గా నాగబాబు కీలక ప్రెస్ మీట్| Nagababu Appointed AP Green Committee Chairman