మూడు రాజధానుల వివాదం... డీఎస్పీ కాలర్ పట్టుకున్న టీడీపీ నేతలు

By telugu teamFirst Published Jan 22, 2020, 10:38 AM IST
Highlights

ఇదిలా ఉండగా విద్యార్థతి యువజన ఐకాస ఆధ్వర్యంలో విద్యార్థులు గుంటూరులో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎన్టీఆర్ కూడలి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. కళాశాల, పాఠశాల బస్సులను అడ్డుకున్నారు. 


మూడు రాజధానుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఈ మూడు రాజధానులపై విషయంలో బుధవారం గుంటూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.  టీడీపీ నేతల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బంద్ కొనసాగుతున్నా.. రోడ్డుపైకి వచ్చి రైతులు, విద్యార్థి సంఘాలు, టీడీపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు.

ఈ క్రమంలో పోలీసులు, రైతులు, టీడీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చటుచేసుకుంది. ఈ నేపథ్యంలో కొందరు టీడీపీ నేతలు డీఎస్పీ సీతారామయ్య కాలర్ పట్టుకున్నారు. దీంతో వాగ్వాదం మరింత ఎక్కువైంది. దీంతో అక్కడి పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

Also Read మూడు రాజధానులు: హైకోర్టు తలుపు తట్టిన అమరావతి రైతులు...

ఇదిలా ఉండగా విద్యార్థతి యువజన ఐకాస ఆధ్వర్యంలో విద్యార్థులు గుంటూరులో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎన్టీఆర్ కూడలి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. కళాశాల, పాఠశాల బస్సులను అడ్డుకున్నారు. మూడు రాజధానుల ప్రకటన ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేస్తున్నారు.  కాగా.. తాజాగా గుంటూరు బంద్ పై పోలీసులు ప్రకటన జారీ చేశారు.

బంద్ కు ఎలాంటి అనుమతులు లేవని, బంద్ తో ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని అన్నారు. పాఠశాలలు,దుకాణాలు బలవంతంగా మూయించవద్దని, శాంతిభద్రతలకు ఎలాంటి భంగం కలిగింవవద్దని చెప్పారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

click me!