ఏపీ-తెలంగాణ బోర్డర్‌లో ఉద్రిక్తత: పొందుగల వద్ద కూలీలను అడ్డుకున్న పోలీసులు

By Siva KodatiFirst Published May 3, 2020, 8:40 PM IST
Highlights

తెలంగాణలో ఉన్న ఏపీ వలస కూలీలు అక్కడి ప్రభుత్వం ఇచ్చిన అనుమతి పత్రాలతో స్వరాష్ట్రానికి బయల్దేరారు. అయితే ఈ పాస్‌లను ఏపీ సరిహద్దుల వల్ల ఆ రాష్ట్ర అధికారులు అడ్డుకుంటున్నారు. 

లాక్‌డౌన్ కారణంగా దేశ ప్రజలు ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. రవాణా సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వలస కూలీల అవస్థలు వర్ణనాతీతం.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వలస కూలీలు తమ స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతిని ఇచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతకు కారణం అయ్యింది.

Also Read:వలస కార్మికులకే తొలి ప్రాధాన్యం.. రెండో దశలో మిగిలిన వారికి ఛాన్స్: ఆళ్ల నాని

తెలంగాణలో ఉన్న ఏపీ వలస కూలీలు అక్కడి ప్రభుత్వం ఇచ్చిన అనుమతి పత్రాలతో స్వరాష్ట్రానికి బయల్దేరారు. అయితే ఈ పాస్‌లను ఏపీ సరిహద్దుల వల్ల ఆ రాష్ట్ర అధికారులు అడ్డుకుంటున్నారు.

తాజాగా గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల ఏపీ- తెలంగాణ సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న గురజాల డీఎస్పీ శ్రీధర్ బాబు పరిస్ధితిని సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... కొంతమంది లాక్‌డౌన్ ఎత్తివేశారని ఇక్కడికి వస్తున్నారని అటువంటి వారు ఎవరూ ఇక్కడకు రావొద్దని డీఎస్పీ తెలిపారు. ఎవరైతే  వలసకూలీలు ఉన్నారో వారు ప్రభుత్వం సూచించిన టోల్ ఫ్రీ నెంబర్ 1902కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవాలని డీఎస్పీ చెప్పారు.

రిజిష్టర్ అయిన మొబైల్ నెంబర్‌కు మెసేజ్ ఫార్వార్డ్ చేస్తారని, దానిని తీసుకుని రావాలని ఆయన సూచించారు. కొంతమంది లోకల్ పోలీసు అధికారుల ద్వారా పాసులు రాయించుకుని వస్తున్నారని అటువంటి పాసులు అనుమతించబడవని ఆయన చెప్పారు.

Also Read:మళ్లీ అదే సమస్య: తెలంగాణ పాస్‌లు చెల్లవు.. ఎక్కడి వారు అక్కడే వుండాలన్న ఏపీ

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇళ్లలోంచి బయటకు రావొద్దని డీఎస్పీ విజ్ఞప్తి  చేశారు. మరోవైపు ప్రయాణాల వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముందని ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

అందువల్ల పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారు అక్కడే ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సరిహద్దుల వద్దకు వచ్చి ఎవరూ ఇబ్బందులు పడొద్దని కోరింది. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం కేవలం వలస కూలీలకు మాత్రమే రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వేల సంఖ్యలో ఉన్న వలస కూలీలను తీసుకొచ్చి క్వారంటైన్‌లో పెట్టి సదుపాయాలు కల్పిస్తున్నామని.. అందువల్ల మిగిలినవారు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కరోనా దృష్ట్యా ఎక్కడి వారు అక్కడే ఉండటం క్షేమకరమని, కోవిడ్ 19పై చేస్తున్న పోరాటంలో ప్రజలు చూపుతున్న స్ఫూర్తి ప్రశంసనీయమని ఏపీ సర్కార్ అభినందించింది. 

click me!