
కృష్ణాజిల్లాలో జరుగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో శుక్రవారం ఉద్రిక్తత పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు వెనుక ర్యాలీగా వస్తున్న గుంపులోకి ఓ వైసీపీ కార్యకర్త దూసుకొచ్చాడు. అనంతరం వైసీపీ జెండా ఊపుతూ హల్ చల్ చేశాడు. దీనిని గమనించిన టీడీపీ కార్యకర్తలు అతనిని అడ్డుకుని చితకబాదారు. విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు ఆ ప్రాంతానికి భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. అక్కడే వున్న పోలీసులు జోక్యం చేసుకుని చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు జిల్లా ఎస్పీతో మాట్లాడారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.