రెండో విడత పంచాయితీ ఎన్నికల్లో ప్రజలు ఉత్సాహంతో స్వేచ్ఛగా ఓటు వేసి ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని ఇనుమడింపజేశారని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కు మార్ చెప్పారు.
తిరుపతి: రెండో విడత పంచాయితీ ఎన్నికల్లో ప్రజలు ఉత్సాహంతో స్వేచ్ఛగా ఓటు వేసి ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని ఇనుమడింపజేశారని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కు మార్ చెప్పారు.
ఏపీ ఎస్ఈసీ ఆదివారం నాడు ఉదయం తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకొన్నారు. రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన స్పందించారు.ఈ మేరకు ఓ వీడియోను ఆయన మీడియాకు విడుదల చేశారు.
undefined
రాష్ట్రంలోని సగభాగం పంచాయితీల్లో చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయన్నారు. ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకొన్నారని ఆయన చెప్పారు.
కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పనిచేశారని ఆయన ప్రశంసించారు. సాధారణ ఎన్నికల తరహాలో అధికారులు చేసిన ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏర్పాట్లు చేసిన అధికారులను ఆయన అభినందించారు.
also read:ఎస్ఈసీ అర్థం చేసుకోలేదు: షోకాజ్‌కి మంత్రి కొడాలి సమాధానం
మూడో విడత ఎన్నికల సమయంలో సమస్యాత్మక గ్రామాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. పంచాయితీ ఎన్నికల మాదిరిగా కాకుండా జనరల్ ఎన్నికల మాదిరిగా ఏర్పాట్లు కూడ ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొన్నట్టుగా ఆయన తెలిపారు.