ముద్రగడ పాదయాత్రకు హైకోర్టు అభయం

Published : Nov 15, 2016, 09:56 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
ముద్రగడ పాదయాత్రకు హైకోర్టు అభయం

సారాంశం

ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేసే హక్కు అందరికీ ఉంటుంది. శాంతిభద్రతల పోలీసుల బాధ్యత - హైకోర్టు

కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన అయిదు రోజుల సత్యాగ్రహ పాదయాత్ర ని నిలిపివేసేందుకు హైకోర్టు అంగీకరించలేదు. ఆపనిచేయలేమని ఈ రోజు కోర్టు స్పష్టంగా పేర్కొంది.

 

ఒక నాయకుడు పాద యాత్ర చేసినంత మాత్రాన శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ఎలా చెప్పగలరు అని ప్రశినస్తూ ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఎవరికయినా ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.  ఇలాంటి సందర్భాలలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా  పోలీసులు చర్యలు తీసుకోవాలని కోర్టు  స్పష్టంగా పేర్కొంది.

 

ఎన్నికలపుడు ప్రభుత్వం చేసిన హామీ ప్రకారం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాపులను బీసీల్లో చేర్చా డిమాండ్ చేస్తూ  నవంబర్ 16 నుంచి 21 వరకూ ముద్రగడ ఆధ్వర్యంలో కాపు ఉద్యమకారులు సత్యాగ్రహ పాదయాత్ర  చేస్తున్నారు. ఈ పాదయాత్ర రావులపాలెం నుంచి అంతర్వేది వరకు అయిదు రోజులపాటు సాగుతుంది.

 

ఈ పాదయాత్రకు అనుమతి లేదని, ఇచ్చేది కూడా లేదని పోలీసులు, హోంమంత్రి చెబుతున్నారు. సెక్షన్ 144, 30 విధించి పెద్ద ఎత్తున పోలీసులను మెహరించారు. శాంతిభద్రతల రీత్యా కాపుల పాదయాత్ర జరగకుండా చూడాలని కోర్టుల దాఖలయిన  ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఈ మధ్యాహ్నం కోర్టు పరిశీలనకు వచ్చింది. గతంలో తునిలో ముద్రగడ ఏర్పాటు చేసిన  కాపు గర్జన అదుపు తప్పి ఒక రైలు, పోలీస్ స్టేషన్ ల దగ్ధానికి దారితీసిన విఫయం గుర్తుచేస్తూ, ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటుందని ప్రభుత్వం హామీ ఇవ్వగలదా అని ప్రశ్నిస్తూ పాదయాత్రను అపేసేలా అదేశాలుఇవ్వాలని రాజమండ్రికి చెందిన మేడా శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశారు.

 

ఈ సందర్భంగా పాదయాత్రను అడ్డుకోవడం సరికాదని కోర్టుపేర్కొంది.

 

 

 

PREV
click me!

Recommended Stories

Indian Women’s Cricket Team Members Visit Narasimha Swamy Temple in Vizag | Asianet News Telugu
Bhuma Akhila Priya Reacts to Allegations of Irregularities in Ahobilam Temple | Asianet News Telugu