జీతాల కోసం రోడ్డెక్కడం, బెగ్గింగ్ చేయడం ఏపీ చరిత్రలో ఎప్పుడైనా చూశామా?.. సీఎస్ పై హైకోర్టు మండిపాటు..

Published : Dec 23, 2022, 10:42 AM ISTUpdated : Dec 23, 2022, 10:43 AM IST
జీతాల కోసం రోడ్డెక్కడం, బెగ్గింగ్ చేయడం ఏపీ చరిత్రలో ఎప్పుడైనా చూశామా?.. సీఎస్ పై హైకోర్టు మండిపాటు..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లో జీతాల బకాయిల మీద హైకోర్టు సీరియస్ అయ్యింది. జీతాల కోసం రోడ్డెక్కడం, బెగ్గింగ్ చేయడం ఎప్పుడైనా జరిగిందా అంటూ సీఎస్ మీద సీరియస్ అయ్యింది. 

అమరావతి :  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె జవహర్ రెడ్డిని హైకోర్టు గట్టిగా నిలదీసింది. స్కూలు పరిసరాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలు,  రైతు భరోసా కేంద్రాలు  నిర్మించొద్దని కోర్టు ఆదేశించింది. దీనికి దీనికి విరుద్ధం నిర్మాణాలు చేపట్టడం పై వివరణ ఇచ్చేందుకు ఆయన హైకోర్టుకు హాజరయ్యారు. ఆయన మీద హైకోర్టు పలు ప్రశ్నలు వేసింది. ప్రభుత్వ లోపాలపై  మండిపడింది. స్కూలు పరిసరాల్లో ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం పై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని.. దీనికి సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

వారు సమర్పించిన అఫిడవిట్ ను పరిశీలించిన తర్వాత..  నిర్మాణాలు  కూల్చివేయాలా? వద్దా? అనేది తేలుస్తామని చెప్పింది. దీంతోపాటు ఉ ఆ నిర్మాణాలకు ఖర్చైనా 40 కోట్ల రూపాయలను.. దీనికి బాధ్యులైన అధికారులపై నుంచి రాబట్టే.. ఈ విషయంపై ఆదేశాలు ఇస్తామని స్పష్టంగా తేల్చి చెప్పింది. ఇక ఉద్యోగులు, గుత్తేదారులు, న్యాయాధికారులు, సిబ్బందికి బకాయిల చెల్లింపుల్లో జరుగుతున్న ఆలస్యంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

దీనిమీద సిఎస్ కు పలు ఆదేశాలు ఇచ్చింది. జనవరి 20కి విచారణను వాయిదా వేసింది. గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ ఆదేశాలు జారీ చేశారు. 2020 జూన్ 11న.. స్కూలు పరిసరాల్లో ఇతర శాఖల నిర్మాణాలకు వీల్లేదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినా ఇప్పటికీ నిర్మాణాలు కొనసాగుతున్నాయని 2021లో దీనిమీద హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఇటీవల  న్యాయమూర్తి వీటి మీద విచారణ జరిపారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించడంపై  తీవ్ర ఆగ్రహం  వ్యక్తం చేశారు.

మచిలీపట్టణం నుండి ఎంపీగా గెలుపు: కైకాల సత్యనారాయణ రాజకీయ ప్రస్థానం ఇదీ

అంతేకాదు,   కర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. వాటిని పెడచెవిన పెట్టి.. ఈ నిర్మాణాలను చేపట్టినందున  అవి అక్రమ నిర్మాణాల కిందకే వస్తాయని.. వాటికి బిల్లులు చెల్లించడం కూడా అక్రమమేనని మండిపడింది. పంచాయతీ రాజ్, పురపాలక శాఖ,  పాఠశాల విద్యాశాఖ లతో ఈ వ్యవహారం ముడిపడి ఉంది.  కాబట్టి  దీనిమీద వివరణ ఇచ్చేందుకు  సీఎస్ కోర్టుకు హాజరు కావాలని గతంలోనే ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు గురువారం సీఎస్ జవహర్ రెడ్డి తో పాటు పంచాయతీరాజ్ శాఖ, పాఠశాల విద్యాశాఖల ముఖ్య కార్యదర్శులైన గోపాలకృష్ణ ద్వివేది, ప్రవీణ్ ప్రకాష్ లు కూడా కోర్టుకు హాజరయ్యారు.

హైకోర్టు వేసిన సూటి ప్రశ్నలకు సి ఎస్ జవహర్ రెడ్డి సమాధానాలిస్తూ..  స్కూలు పరిసరాల్లోని ప్రాంతాల్లో అరవై మూడు చోట్ల సచివాలయాలు,  ఆర్బీకేలు నిర్మించామని తెలిపారు. అయితే అలా నిర్మించిన భవనాలను  భవనాల 57చోట్ల ఆయా స్కూళ్లకే ఇచ్చేశామని,  వాటిని స్కూల్ యజమాన్యం క్లాస్ రూమ్ లుగా,  ఇతర అవసరాలకు అనుగుణంగా వాడుకుంటున్నారు అని తెలిపారు. కోర్టు అనుమతితో మిగతా భవనాల నిర్మాణాలు కూడా పూర్తిచేసి అలాగే విద్య అవసరాలకు వినియోగిస్తామని చెప్పుకొచ్చారు. 

ఇది మూడు శాఖల తో ముడిపడిన వ్యవహారం కావడం వల్ల కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో ఆలస్యం జరిగిందని..  మరోసారి ఇలా జరగనివ్వమని.. క్షమించాలని సి ఎస్ హైకోర్టును కోరారు. ఈ వాదనలను న్యాయమూర్తి పరిగణలోకి తీసుకొని అనేక ప్రశ్నలు వేశారు. గోపాలకృష్ణ ద్వివేదిపై హైకోర్టు మండిపడింది.  జాతీయ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులను సచివాలయాలు, ఆర్ బికేలు కట్టడానికి ఎలా ఉపయోగిస్తారని..  ఆ నిధులను ఎలా మళ్లిస్తారని  ప్రశ్నించింది. ఇక సిఎస్ ను ఉద్దేశించి.. మీరు ఎక్కడ చదువుకున్నారో తెలియదు కానీ అబ్దుల్ కలాం వెంకయ్యనాయుడు నరేంద్ర మోడీ వంటి ప్రముఖులందరూ గవర్నమెంట్ స్కూల్ లోనే చదువుకున్నారు. 

పేద విద్యార్థులు చదువుకునే గవర్నమెంట్ స్కూళ్లపై ప్రభుత్వానికి ఎందుకు చులకన భావం అని సిఎస్ ను గట్టిగా ప్రశ్నించింది. అంతేకాదు జీతాల కోసం టీచర్లు రోడ్డెక్కడం ఎప్పుడైనా చూశారా ఏపీ చరిత్రలోనే ఇది జరిగింది?  ఇంత దురదృష్టకర పరిస్థితి కాదా ఇది? జీతాల కోసం  అడుక్కోవడం నేను ఎప్పుడూ చూడలేదు. టీచర్లకు  జీతాలు ఇవ్వడానికి డబ్బులు ఉండవు కానీ..  అక్రమ నిర్మాణాల కోసం మాత్రం రూ. 40 కోట్ల బిల్లులు ఎలా చెల్లిస్తారు? అని ప్రశ్నించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్