రేపటి నుండి ఏపీలో వర్షాలు: మూడు రోజులపాటు వానలు

By narsimha lode  |  First Published Dec 23, 2022, 9:43 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఈ నెల  24వ తేదీ నుండి  వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.  వాయుగుండం ప్రభావంతో  వర్షాలు కురుస్తాయని  ఐఎండీ వివరించింది.  


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  రేపటి నుండి మూడు రోజులపాటు వర్షాలు కురిసే  అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి  బంగాళాఖాతంలో  ఏర్పడిన  ఉపరితల ద్రోణి అల్పపీడనంగా  మారింది. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా  పయనిస్తూ  గురువారంనాటికి  వాయుగుండంగా  మారిందని  భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం  పశ్చిమ నైరుతి దిశగా కదిలే అవకాశం ఉందని  వాతావరణశాఖ తెలిపింది.  

దీని ప్రబాశంతో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వర్షాలు కురిసే అవకాశం ఉందని  వాతావరణశాఖాధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు రాష్ట్రంలో కూడా  వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఈ నెల  24వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వర్షాలు కురుస్తాయని  ఐఎండి తెలిపింది.  రాయలసీమ, దక్షిణ కోస్తాలో  వర్షాలు కురిసే అవకాశం ఉందని  వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు రాష్ట్రంలో  ఈ వాయుగుండం ప్రభావం  ఎక్కువగా ఉండే అవకాశం ఉందని  ఐఎండి  తెలిపింది

Latest Videos

click me!