మచిలీపట్టణం నుండి ఎంపీగా గెలుపు: కైకాల సత్యనారాయణ రాజకీయ ప్రస్థానం ఇదీ

By narsimha lode  |  First Published Dec 23, 2022, 10:27 AM IST

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని  మచిలీపట్టణం  ఎంపీ స్థానం నుండి కైకాల సత్యనారాయణ టీడీపీ అభ్యర్ధిగా  1996లో  విజయం సాధించారు.  1998లో  కాంగ్రెస్  పార్టీ  అభ్యర్ధి  చేతిలో  ఆయన ఓటమి పాలయ్యాడు. 


అమరావతి: ప్రముఖ సినీ నటుడు కైకాల సత్యనారాయణ  రాజకీయాల్లో రాణించారు.టీడీపీ వ్యవస్థాపకులు  నందమూరి తారకరామారావుతో  ఎన్టీఆర్ కు  ఆయనతో  సన్నిహిత సంబంధాలున్నాయి.  అనేక సినిమాల్లో  ఎన్టీఆర్ కు డూప్ గా  సత్యనారాయణ డూప్ గా  నటించారు.  పలు ఎన్నికల సమయాల్లో  కైకాల సత్యనారాయణ  టీడీపీ తరపున  ప్రచారం  నిర్వహించారు.  

సినీ రంగానికి చెందిన  ప్రముఖులు  పలువురు టీడీపీ తరపున పోటీ చేసి  విజయం సాధించారు.  సినీ నిర్మాత  రామానాయుడు  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని  ఎంపీగా  విజయం సాధించారు. మురళీ మోహన్  2009, 2014 ఎన్నికల్లో  రాజమండ్రి నుండి  పోటీ చేశారు.  2009లో  ఆయన ఓటమి పాలయ్యాడు.  2014లో  మురళీమోహన్ విజయం సాధించారు. 

Latest Videos

undefined

కైకాల సత్యనారాయణ  కూడా  ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్టణం  ఎంపీ స్థానం నుండి ఆయన  ప్రాతినిథ్యం వహించారు. మచిలీపట్టణం  పార్లమెంట్  స్థానంలో  సత్యనారాయణ  1996లో  విజయం సాధించారు.  మచిలీపట్టణం  ఓటర్లు విలక్షణమైన తీర్పును ఇచ్చేవారు.  ఈ స్థానం నుండి  రాజకీయ ఉద్ధండులు విజయం సాధించారుఇలాంటి  పార్లమెంట్  స్థానం నుండి  కైకాల సత్యనారాయణ విజయం సాధించారు.  

 మండలి వెంకటకృష్ణారావు,  మోటూరు హనుమంతరావు,  వడ్డే శోభనాద్రీశ్వరావు,  , కావూరి సాంబశివరావు,అంబటి బ్రహ్మణయ్య, బూరగడ్డ నిరంజన్ రావు  తదితరులు ఈ స్థానం నుండి  విజయం సాధించారు.  కావూరి సాంబశివరావు  ఈ స్థానం నుండి  మూడు దఫాలు విజయం సాధించారు. ఆ తర్వాత  ఆయన  ఏలూరు నుండి ఏలూరు నుండి  కూడా గెలుపొందారు. 1996లో  జరిగిన  ఎన్నికల్లో టీడీపీ నుండి  మచిలీపట్టణం నుండి  కైకాల సత్యనారాయణ  గెలుపొందారు.1998లో  కావూరి సాంబశివరావు చేతిలో  కైకాల సత్యనారాయణ ఓటమి పాలయ్యారు.  దీంతో  సత్యనారాయణ రాజకీయాలకు దూరంగా  ఉంటున్నారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ తో  సత్యనారాయణతో  మంచి అనుబంధం ఉండేది . సినిమా షూటింగ్ ల సమయంలో  వీరిద్దరూ  చాలా ఆప్యాయంగా  ఉండేవారని సినీ ప్రముఖలు  గుర్తు చేసుకుంటున్నారు.  
 

click me!