పంచాయతీ ఎన్నికలు: జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్

Published : Dec 08, 2020, 11:44 AM ISTUpdated : Dec 08, 2020, 12:14 PM IST
పంచాయతీ ఎన్నికలు: జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్

సారాంశం

పంఛాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను నిలిపేయాలని ఎస్ఈసీని ఆదేశించాలని కోరుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. ప్రక్రియపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే రాష్ట్ర ఎన్నిక కమిషన్ నిర్ణయాన్ని కొట్టేయాలని జగన్ ప్రభుత్వం ప్రభుత్వం హైకోర్టును కోరింది. ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసి పుచ్చింది. 

ఈ పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది. తర్వాతి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ మధ్య ప్రకటించారు. 

ఆ ప్రక్రియను నిలిపివేసే విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం హైకోర్టును కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశఆరు 

ఫిబ్రవరిలో పాంచయీతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని, ఎసీసీ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా ప్రకటన చేశారని పిటిషన్ లో చెప్పారు. ఎస్ఈసీ ప్రకటన సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా లేదని చెప్పారు. 

కరోనాతో రాష్ట్రంలో ఇప్పటికే 6 వేల మందికి పైగా మరణించారని, ఈ సమయంలో ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ కర్తవ్యమని చెప్పారు. దానీపై ఇప్పటికే చాలా సార్లు విచారణ జరిపిన హైకోర్టు తాజా నిర్ణయాన్ని ప్రకటించింది.

PREV
click me!

Recommended Stories

Chandrababu, Lokesh కి వెంకన్న ప్రసాదం ఇచ్చిన టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ | Asianet News Telugu
నారావారిపల్లెలో CM Chandrababu Family గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు | Asianet News Telugu