ఏలూరులో వింత వ్యాధి: సీసీఎంబీ, సీఎఫ్‌సీ నివేదిక కోసం చూస్తున్న వైద్యులు

By narsimha lodeFirst Published Dec 8, 2020, 10:59 AM IST
Highlights

ఏలూరు పట్టణంలో వింతవ్యాధికి  సీసం టాక్టిన్స్ కారణమని తేలిందని ఏలూరు ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ మోహన్ చెప్పారు. అయితే ఇంకా సీసీఎంబీ, సీఎఫ్‌సీకి సంబంధించిన నివేదిక రావాల్సి ఉందన్నారు.
 

ఏలూరు:  ఏలూరు పట్టణంలో వింతవ్యాధికి  సీసం టాక్టిన్స్ కారణమని తేలిందని ఏలూరు ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ మోహన్ చెప్పారు. అయితే ఇంకా సీసీఎంబీ, సీఎఫ్‌సీకి సంబంధించిన నివేదిక రావాల్సి ఉందన్నారు.

ఓ తెలుగు న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడారు.  ఇంకా 40 మంది బ్లడ్ , యూరిన్ శాంపిల్స్ ను ఢిల్లీ ఎయిమ్స్ కు పంపినట్టుగా ఆయన చెప్పారు.వీటి నివేదిక ఇంకా రావాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. వింత వ్యాధిపై ఎన్ఐఎన్ బృందం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తోందన్నారు.

శనివారం నుండి ఏలూరులో వింత వ్యాధితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గంట గంటకు ఈ వ్యాధి బారినపడే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. మంగళవారం నాడు ఉదయానికి సుమారు 513 కిపైగా బాధితుల సంఖ్య చేరినట్టుగా అధికారులు తెలిపారు. వీరిలో 168 మంది చికిత్స పొంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.153 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఏలూరులో వింత వ్యాధికి సంబంధించిన కారణాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి.

click me!