టీటీడీకి హైకోర్టు షాక్: మిరాశి అర్చకులకు రిటైర్మెంటొద్దు

By narsimha lodeFirst Published Dec 13, 2018, 7:45 PM IST
Highlights

మిరాశి అర్చకుల పదవి విమరణ విషయంలో టీటీడీకి హైకోర్టు ఎదురు దెబ్బ తగిలింది

తిరుపతి: మిరాశి అర్చకుల పదవి విమరణ విషయంలో టీటీడీకి హైకోర్టు ఎదురు దెబ్బ తగిలింది.రిటైర్మెంట్ లేకుండా మిరాశి అర్చకులను కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది.

రిటైర్మెంట్ ను అమలు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకొంది.ఈ నిర్ణయాన్నిసవాల్ చేస్తూ మిరాశి అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మిరాశి అర్చకులకు అనుకూలంగా తీర్పును వెలువరించింది.

హైకోర్టు తీర్పు మిరాశి అర్చకులకు అనుకూలంగా తీర్పు రావడంతో టీటీడీ సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావిస్తోంది..గోవిందరాజస్వామి, తిరుచానూరు ఆలయాల్లో మిరాశి అర్చకులకు రిటైర్మెంట్ విధానాన్ని అమలు చేసింది.  

2012లో ఇదే నిబంధనను టీటీడీ అమలు చేసింది. ఆ సమయంలో కూడ అర్చకులు హైకోర్టును ఆశ్రయించి టీటీడీకి వ్యతిరేకంగా విజయం సాధించారు.ఈ ఏడాది మే లో వయో పరిమితి విధించింది. 

65 ఏళ్ల వయస్సు దాటిన అర్చకులకు రిటైర్మెంట్ ఇవ్వాలని టీటీడీ నిర్ణయం తీసుకొంది.ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు టీటీడీకి వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని టీటీడీ భావిస్తోంది.

click me!