కన్నబిడ్డను రూ.లక్షకు అమ్మకానికి పెట్టిన తల్లి

Published : Dec 13, 2018, 04:45 PM IST
కన్నబిడ్డను రూ.లక్షకు అమ్మకానికి పెట్టిన తల్లి

సారాంశం

కడుపున పుట్టిన బిడ్డను.. కన్న తల్లే రూ.లక్షకి అమ్మకానికి పెట్టింది. బిడ్డను పోషించే స్థోమత లేకపోడంతో.. ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది.

కడుపున పుట్టిన బిడ్డను.. కన్న తల్లే రూ.లక్షకి అమ్మకానికి పెట్టింది. బిడ్డను పోషించే స్థోమత లేకపోడంతో.. ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..విజయవాడకు చెందిన సాయిలక్ష్మీ అనే మహిళ.. నవంబర్ 30వ తేదీన ఆడపిల్లకు జన్మనిచ్చింది. గత కొంతకాలం క్రితమే.. ఆమెను భర్త విడిచి వెళ్లిపోయాడు. దీంతో.. తనను, కడుపున పుట్టిన బిడ్డను పోషించే స్థోమతలేక.. ఎవరికైనా అమ్మేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో సాయిలక్ష్మీ మరో మహిళ సాయంతో హైదరాబాద్ కి చెందిన ఓ జంటకు 13రోజుల పసికందుని రూ.1.10లక్షలకు విక్రయించింది.

అయితే.. ఈ విక్రయంలో బేరసారాలు జరగుతుండగా.. అంగన్ వాడీ సిబ్బంది గమనించి ఈ అమ్మకాన్ని అడ్డుకున్నారు. బిడ్డ తల్లిని, మధ్యవర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరసగా మూడో కాన్పులో ఆడపిల్ల పుట్టడం.. భర్త వదిలేయడం, పోషణ కరువవ్వడంతో ఇలా చేసినట్లు  ఆ మహిళ అధికారులకు తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

Government Jobs : తెలుగు యువతా బి రెడీ .. భారీ జాబ్ నోటిఫికేషన్ రాబోతోంది
AP Power Sector : ఏపీకి కొత్త పవర్ ప్లాన్.. తీరనున్న కరెంట్ కష్టాలు..భవిష్యత్ కోసం బ్యాటరీ స్టోరేజ్