జగన్ సర్కార్ కు మరో ఎదురుదెబ్బ... రాజధాని తరలింపుపై స్టేటస్ కో పొడిగించిన హైకోర్టు

By Arun Kumar PFirst Published Sep 21, 2020, 12:47 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు కీలక నిర్ణయాన్ని వెలువరించింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు కీలక నిర్ణయాన్ని వెలువరించింది. ఈ విచారణను అక్టోబర్‌ 5కు వాయిదా వేసిన న్యాయస్థానం ప్రస్తుతం రాజధానిపై ఉన్న స్టేటస్‌కో ను కూడా అప్పటివరకు (అక్టోబర్‌ 5) పొడిగిస్తున్నట్లు ఆదేశించింది. అక్టోబర్‌ 5 నుంచి రాజధాని విషయంపై దాఖలైన పిటిషన్లపై రోజువారీ విచారణ చేపడామని హైకోర్టు పేర్కొంది. 

వైసిపి ప్రభుత్వ మూడు రాజధానుల ప్రకటన ఆంధ్రప్రదేశ్ లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. హై కోర్టు తొలుత విధించిన స్టేటస్ కో ను వచ్చే నెల 5వ తేదీ వరకు పొడిగించడంతో వైసీపీ వర్గాలు ఆందోళన చెందుతుండగా... అమరావతి ప్రాంత వాసులేమో ఈ తీర్పుపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

 ప్రజల రియాక్షన్స్ పక్కకుంచితే  జగన్ సర్కార్ భయపడినదంతా జరిగింది. తొలుత గత నెల ఆగస్ట్ 16వ తేదీన విశాఖలో కార్యనిర్వాహక రాజధానికి శంకుస్థాపన చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసారు. ఇందుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం సైతం పంపారు. నేరుగా రావడానికి కుదరకపోతే కనీసం వర్చువల్ గా అయినా శంకుస్థాపన చేయాలని కోరారు. 

జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ...రాజధాని తరలింపుపై స్టేటస్ కో పొడిగించిన హైకోర్టు

కానీ ఏమైందో ఏమో కానీ ఉన్నట్టుండి ముహుర్తాన్ని దసరాకి వాయిదా వేశారు. ప్రధాని అపాయింట్మెంట్ కుదరక అని చెప్పినప్పటికీ... న్యాయస్థానాలు తీసుకునే నిర్ణయాలు అనుకూలిస్తాయో లేవో అనే ఒక అనుమానం కూడా జగన్ సర్కార్ మనసులో ఉండే వాయిదా వేసినట్టుగా వార్తలు వచ్చాయి. 

మరోపక్క జగన్ సర్కార్ సాధ్యమైనంత త్వరగా కోర్టులో ఈ విషయానికి శుభం కార్డు వేసేందుకు ప్రణాళికలను రచిస్తోంది. రైతులకు అమరావతిలో ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేసి ఇస్తామో చెప్పే ఒక ప్లాన్ ను రూపొందిస్తుంది. అభివృద్ధి ఎలా చేయబోతున్నామో చెబుతూ... ఈ పూర్తి విషయాన్నీ కోర్టు ముందు ప్రభుత్వం  ఉంచాలనుకుంటుందని సమాచారం.

ఇలా కోర్టుకు సమర్పించడం ద్వారా మౌలికంగా రైతులు తమకు అన్యాయం జరిగిందని చెబుతున్న వాదనకు....  ప్రభుత్వం ఈ ప్లాన్ ద్వారా వారికి నష్టం కలగకుండా చూస్తామని కోర్టుకు చెప్పొచ్చని భావిస్తోంది. కోర్టు గనుక ప్రభుత్వ వాదనకు అంగీకరిస్తే ఈ వివాదానికి శుభం కార్డు వేయొచ్చు అని భావిస్తుంది. 
 

click me!