సీఐడీపై నమ్మకం లేదు: డాక్టర్ అనితా రాణి పిటిషన్ పై సీబీఐ, సీఐడీకి హైకోర్టు నోటీసులు

By narsimha lodeFirst Published Jun 22, 2020, 12:40 PM IST
Highlights

తన కేసు విచారణను సీబీఐకి ఇవ్వాలని కోరుతూ డాక్టర్ అనితారాణి దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం నాడు ఏపీ హైకోర్టు విచారించింది. ఈ కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ విషయమై సీఐడీ, సీబీఐ, ప్రభుత్వానికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

అమరావతి: తన కేసు విచారణను సీబీఐకి ఇవ్వాలని కోరుతూ డాక్టర్ అనితారాణి దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం నాడు ఏపీ హైకోర్టు విచారించింది. ఈ కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ విషయమై సీఐడీ, సీబీఐ, ప్రభుత్వానికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

చిత్తూరు జిల్లాలోని పెనుమూరు పీహెచ్‌సీలో పనిచేస్తున్న డాక్టర్ అనితా రాణి తనను వైసీపీ నేతలు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు  అనితారాణి ఆడియోను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు.

also read:సీబీఐ విచారణ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన డాక్టర్ అనితారాణి
ఈ విషయమై సీఐడీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్ అనితారాణి డిప్యూటీ సీఎం నారాయణస్వామి నియోజకవర్గంలో పనిచేస్తున్నారు.
సీఐడీ విచారణపై తనకు నమ్మకం లేదని డాక్టర్ అనితారాణి ప్రకటించారు. సీఐడీ అధికారులు విచారణకు వచ్చిన సమయంలో ఆమె ఇంటికి తాళం వేసుకొన్నారు. ఫోన్ లో సీఐడీ అధికారులకు ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు.

సీఐడీ విచారణ నిష్పక్షపాతంగా లేదని డాక్టర్ అనితారాణి ఆరోపించారు. తనపై వేధింపుల కేసును విచారణను సీబీఐకి అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ఈ నెల 15వ తేదీన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది.

సీఐడీ విచారణపై నమ్మకం లేదని ఆమె పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, సీఐడీకి హైకోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది, రెండు వారాల పాటు ఈ కేసు విచారణను వాయిదా వేసింది.

డాక్టర్ అనితారాణి కేసు రాజకీయ రంగు పులుముకొంది. వైసీపీ నేతలు డాక్టర్ అనితా రాణి వేధింపులకు గురి చేశారని టీడీపీ ఆరోపించింది. ఈ ఆరోపణలను వైసీపీ తీవ్రంగా ఖండించింది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. దళితులను అడ్డం పెట్టుకొని చంద్రబాబు రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు.


 

click me!