ఆఫీసుల తరలింపు: వైఎస్ జగన్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

By telugu team  |  First Published Feb 4, 2020, 1:17 PM IST

అమరావతి నుంచి కార్యాలయాలను తరలించాలనే జగన్ ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు మండిపడింది. పిటిషన్లు విచారణలో ఉండగా కార్యాలయాలను ఎలా తరలిస్తారని ప్రశ్నించింది.


అమరావతి: అమరావతి నుంచి కార్యాలయాల తరలింపుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. విజిలెన్స్ కార్యాలయాన్ని తరలించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టింది.

పిటిషన్లు తమ వద్ద పెండింగులో ఉండగా కార్యాలయాలను ఎలా ఇతర ప్రాంతాలకు తరలిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలనే ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

Latest Videos

undefined

Also Read: వైఎస్ జగన్ ప్రభుత్వం సంచలనం: అర్థరాత్రి జీవో జారీ

మూడు రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఈ నెల 26వ తేదీ వరకు కార్యాలయాల తరలింపుపై హైకోర్టు స్టే ఇచ్చింది. కార్యాలయాల తరలింపుపై కారుమంచి ఇంద్రనీల్ సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కార్యాలయాల తరలింపును సవాల్ చేస్తూ హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి.

మూడు రాజధానుల ప్రతిపాదనలో భాగంగా వైఎస్ జగన్ ప్రభుత్వం విజిలెన్స్ కార్యాలయాన్ని కర్నూలుకు తరలిస్తూ జీవో జారీ చేసింది.

click me!