ప్రజావేదిక నిర్మాణ వ్యయం రికవరీ : చంద్రబాబు, నారాయణలే టార్గెట్

By Nagaraju penumalaFirst Published Jun 26, 2019, 8:43 AM IST
Highlights

మెుత్తానికి ప్రజావేదిక కూల్చివేత నిలుపువేయాలంటూ హైకోర్టును ఆశ్రయించడమే కాదు ఏకంగా భవన నిర్మాణానికి అయిన ఖర్చు రికవరీ చేయాలంటూ పిటిషనర్ శ్రీనివాస్ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో రికవరీ వ్యయం ఆనాటి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ లేక నిర్మాణ దారుల నుంచి వసూలు చేస్తోందా అసలు కోర్టు ఏం చేప్తుందో తెలియాలంటే మరో రెండు వారాలపాటు వేచి చూడాల్సిందే. 

అమరావతి: ఉండవల్లిలో ప్రజావేదిక అక్రమంగా నిర్మించారని దాన్ని కూల్చివేయాలంటూ ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఆర్డీఏ అధికారులు భవనం కూల్చివేత పనులను చేపట్టారు. ఇప్పటి వరకు ప్రజావేదిక భవనం కూల్చివేత పనులు 60శాతం పూర్తి చేశారు. 

ప్రజావేదిక కూల్చివేత పనులు యుద్ధప్రాతిపదికను జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. కట్టడం అక్రమంగా నిర్మించిన నేపథ్యంలో నిర్మాణ వ్యయాన్ని ఎవరి నుంచి రికవరీ అంశంపై ఏపీ సర్కార్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 

ప్రజావేదిక కూల్చివేత పనులు నిలిపివేయాలంటూ సామాజిక వేత్త పోలూరి శ్రీనివాసరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం పిల్ దాఖలు చేశారు. భవనం అక్రమ నిర్మాణమేనంటూ పిల్ లో పేర్కొన్న పిటీషనర్ ప్రజాధనం దుర్వినియోగం చేసిన నేపథ్యంలో రికవరీ చేపట్టాలని కోరారు. ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణల దగ్గర నుంచి వసూలు చేయాలని కూడా సూచించారు. 

ప్రజావేదిక భవనం కూల్చివేత పనులు నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇకపోతే పిటిషన్ లో పేర్కొన్న మరో అంశం ప్రజావేదిక ఖర్చును తిరిగి రాబట్టాలన్న అంశంపై విచారణ కొనసాగిస్తామని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ అంశంపై విచారణ కొనసాగిస్తామని తెలుపుతూ రెండు వారాలపాటు కేసు విచారణను వాయిదా వేసింది. 

ఇకపోతే ప్రజావేదిక నిర్మాణ వ్యయం రికవరీపై ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ శ్రీరాం హైకోర్టులో కీలక వ్యాఖ్యలు చేశారు. పర్యావరణాన్ని భంగపరిచేలా ఏమైనా నిర్మాణాలు ఉంటే వాటిని కూల్చి, ఆ విఘాతాన్ని తొలగించే బాధ్యత కోర్టులకు ఉందన్నారు. 


పర్యావరణానికి విఘాతం కలించేలా వ్యవహరించిన నిర్మాణదారులనుంచి జరిగిన నష్టాన్ని రికవరీ చేయడం కూడా దీంట్లో భాగమేనని చెప్పుకొచ్చారు. అక్రమ నిర్మాణం చేసిన అప్పటి సీఎం చంద్రబాబు, అప్పటి మంత్రి నారాయణల నుంచి రికవరీ చేయాలన్న అంశంతో తాను కూడా ఏకీభవిస్తాననన్న ఏజీ తెలిపారు. 

అక్రమ నిర్మాణం తొలగించడమే కాదు, దాన్ని ఆ భవనానికి అయిన ఖర్చును రికవరీ చేయడం కూడా ఒక బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఏజీ శ్రీరాం. 
మంచిని పెంచడానికి వ్యవస్థలు ఉండాలి కాని, మంచి పెంచే చర్యలను కట్టడానికి చేయడానికి వ్యవస్థలు ఉండకూడదన్నారు. 

తప్పులు జరగకుండా ఆపడానికి వ్యవస్థలు ఉండాలి తప్ప, ఆ తప్పును బలపరిచేలా చేయడానికి వ్యవస్థలు ఉండకూడదంటూ ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో ఇరువాదనలు విన్న హైకోర్టు 
అక్రమ నిర్మాణానికి అయిన ఖర్చును రికవరీ చేయాలన్న అంశంపై విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.  

మెుత్తానికి ప్రజావేదిక కూల్చివేత నిలుపువేయాలంటూ హైకోర్టును ఆశ్రయించడమే కాదు ఏకంగా భవన నిర్మాణానికి అయిన ఖర్చు రికవరీ చేయాలంటూ పిటిషనర్ శ్రీనివాస్ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో రికవరీ వ్యయం ఆనాటి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ లేక నిర్మాణ దారుల నుంచి వసూలు చేస్తోందా అసలు కోర్టు ఏం చేప్తుందో తెలియాలంటే మరో రెండు వారాలపాటు వేచి చూడాల్సిందే. 

ఈ వార్తలు కూడా చదవండి

ప్రజావేదిక కూల్చివేత స్టేకు హైకోర్టు నిరాకరణ

చంద్రబాబు కళ్లెదుటే ప్రజావేదిక కూల్చివేత: మరికాసేపట్లో నేలమట్టం

 

click me!