పైప్ లైన్ కోసం తవ్వుతుంటే బయటపడ్డ బంగారు నాణాలు..

By SumaBala BukkaFirst Published Dec 3, 2022, 1:39 PM IST
Highlights

ఏలూరులో ఓ రైతును అదృష్టం వరించింది. పైప్ లైన్ కోసం పొలంలో తవ్వుతుండగా మట్టి కుండలో బంగారు నాణాలే బయటపడ్డాయి 

ఏలూరు : అదృష్టం ఎప్పుడూ, ఎవరిని, ఎలా, ఏ రూపంలో వస్తుందో  చెప్పడం కష్టం. అది తలుపు తట్టినప్పుడు సాదరంగా ఆహ్వానించాడమే మనపని. ఏలూరులో ఓ రైతును అలాంటి అదృష్టమే వరించింది. అతనికి ఆయిల్ ఫామ్ తోట ఉంది. అందులో లో పైప్ లైన్ పనుల కోసం కూలీలతో పని చేయిస్తున్నాడు. తవ్వకాలు జరుపుతూ కూలీలు బిజీగా ఉన్నారు.. ఈ క్రమంలో  వారికి  నేలలో ఓ మట్టి కుండ దొరికింది. వెంటనే జాగ్రత్తగా ఆ కుండను బయటకి తీశారు. అది మూత బిగించి ఉంది. బయటికి తీసిన కూలీలు దాన్ని జాగ్రత్తగా ఓపెన్ చేశారు. మిగతావారంతా అందులో ఏముందో అని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

కుండ మూత తెరిచిన కూలీలు ఆశ్చర్యంతో షాక్కు గురయ్యారు.  కుండలో బంగారు నాణాలు ఉన్నాయి. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం ఏడు వాడలపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయిల్ పామ్ తోటలో పైప్లైన్ కోసం తవ్వకాలు జరుపుతుండగా బంగారు నాణాలు లభించాయి. కుండలో మొత్తం 18 బంగారు నాణాలు ఉన్నట్లుగా గుర్తించారు. అయితే ఇలాంటి తవ్వకాల్లో జరిగే దొరికిన నిధుల గురించి ప్రభుత్వానికి  సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఈ విషయాన్ని ఆయిల్పామ్ రైతు తహసిల్దార్ కు తెలిపాడు. 

మూడో తరగతి బాలికతో హెచ్ఎం అసభ్య ప్రవర్తన.. దేహశుద్ధి..

రైతు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు బంగారు నాణాలను పరిశీలించారు. ఒక్కొక్కనాణెం సుమారు ఎనిమిది గ్రాములపైన ఉన్నట్లుగా సమాచారం. ఈ నాణేలు రెండు శతాబ్దాల క్రితం నాటివిగా అనుమానిస్తున్నారు. అయితే, ఇలాంటి నిధులు దొరికిన సమయంలో చట్ట ప్రకారం ఆ సమాచారాన్ని అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. సమాచారం మేరకు రెవెన్యూ పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని పంచనామా నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆ నిధిని కలెక్టర్ కి అప్పగిస్తారు. ఎవరి భూమిలో లేదా ఇంట్లో అవి దొరికాయో అవి… వారి పూర్వీకులు దాచి ఉంచినవా? వారి వారసత్వ సంపద అనేది కలెక్టర్ దర్యాప్తు చేసి నిర్ధారిస్తారు.  

ఒకవేళ అది పూర్వీకుల సంపద అయితే అది ఎవరికీ చెందుతుందో నిర్ధారించి.. వారసులు ఎక్కువమంది ఉంటే వారందరికీ వాటాలు వేసి పంచుతారు. లేదా అది జాతీయ సంపద అయితే .. దొరికిన నిధిలో ల్యాండ్ ఓనర్ కు 1/5వంతు ఇస్తారు. ఆ భూమిని హక్కుదారులు కాకుండా వేరొకరు సాగు చేస్తుంటే.. కౌలుదారులు, నిధిని వెలికి తీసిన కూలీలకు 1/5వంతులోనే కొంత మొత్తాన్ని ఇస్తారు. అలా అధికారులకు సమాచారం ఇవ్వకుండా మొత్తం కాజేయాలని చూస్తే శిక్షార్హులు అవుతారు. 

click me!