విశాఖలోని యారాడ వద్ద ఓ హెలికాప్టర్ గాల్లో దాదాపు 40 నిమిషాలపాటు హెలికాఫ్టర్ చక్కర్లు కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. నేవీ అధికారుల నుంచి క్లారిటీ రావడంతో హెలికాప్టర్ ఎక్కడి నుంచి వచ్చిందన్న అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
విశాఖలోని యారాడ వద్ద ఓ హెలికాప్టర్ గాల్లో చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. సాంకేతిక లోపంతో యారాడ దర్గాకు అత్యంత సమీపంలో దాదాపు 40 నిమిషాలపాటు హెలికాఫ్టర్ చక్కర్లు కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. అనంతరం నేవీ బేస్ వద్ద ముళ్ల పొదల్లో కూలిపోయి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. హెలికాప్టర్ యారాడ దర్గా సమీపంలో అతి తక్కువ ఎత్తులోనే చక్కర్లు కొట్టడంతో అక్కడ ఉన్న కొన్ని చెట్లు నాశనమయ్యాయి. ఎక్కువ సమయం హెలికాప్టర్ అదే ప్రాంతంలో చక్కర్లు కొట్టడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
మరోవైపు ఈ హెలికాప్టర్ ఏ విభాగానికి చెందినదన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. అది తమ హెలికాప్టర్ కాదని నేవీ అధికారులు ధ్రువీకరించారు. నేవీ అధికారుల నుంచి క్లారిటీ రావడంతో హెలికాప్టర్ ఎక్కడి నుంచి వచ్చిందన్న అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇది కోస్ట్ గార్డుకు చెందినదా? లేక ఇతర విభాగాలకు చెందినదా? అనే అంశంపై విచారణ చేపట్టారు.