హీరా గ్రూప్.. ఇన్వెస్టర్లలో ఉగ్రవాదులు..?

By ramya neerukondaFirst Published Jan 4, 2019, 11:28 AM IST
Highlights

స్కీముల పేరుతో రూ.వేల కోట్ల స్కామ్ కి పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. 


స్కీముల పేరుతో రూ.వేల కోట్ల స్కామ్ కి పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. నౌహీరా నేతృత్వంలో నడిచిన ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టిన వారిలో ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు పెట్టిన వారిలో నుంచి.. ఉగ్రవాదులనే అనుమానం కలిగిన వారి జాబితాను పోలీసులు తయారు చేశారు. ఆ జాబితాను సంబంధిత ఏజెన్సీలకు పంపి.. నిజాలు తేల్చే పనిలో పడ్డారు. 

హీరా గ్రూప్ లో పెట్టుబడులు పెట్టిన వారిలో పది నుంచి 15మంది వరకు ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ కేసులో విదేశీ డిపాజిట్ల విషయంలోనూ ఫెమా చట్టం ఉల్లంఘన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై ఈడీకి లేఖ కూడా రాశారు. ప్రస్తుతం మహారష్ట్ర పోలీసుల వద్ద నౌహీరా షేక్ ను ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

గతేడాది అక్టోబర్ లో నౌహీరా షేక్ ని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఎక్కవ వడ్డీ ఆశ చూపి పలు రాష్ట్రాలలో అమాయకులను మోసం చేసి వేల కోట్లలో డిపాజిట్లు వసూలు చేసిన కేసులో నౌహీరాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

read more news

హీరా గ్రూపు కుంభకోణం: రాజకీయ కుట్ర అంటున్న నౌహీరా షేక్‌

హీరా గోల్డ్ ఛైర్మెన్ నౌరాహ్ షేక్ అరెస్ట్

click me!