వైసీపీ బీసీ గర్జన సభ ఎఫెక్ట్: భారీ ట్రాఫిక్ జామ్, గంటన్నరపాటు ఇరుక్కుపోయిన జగన్

By Nagaraju penumalaFirst Published 17, Feb 2019, 10:52 PM IST
Highlights

ఇదే ట్రాఫిక్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం ఇరుక్కుపోయారు. సుమారు గంటన్నరపాటు వైఎస్ జగన్ కాన్వాయ్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. ఇక సభ పరిసర ప్రాంతాల్లో అయితే విషయం మామూలుగా లేదు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అయితే 2గంటలుగాపైగా ట్రాపిక్ లో చిక్కుకుపోయారు.  
 
ఏలూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభ వాహనదారులకు చుక్కలు చూపించింది. వైసీపీ బీసీ గర్జన సభకు భారీగా జనం తరలిరావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 

పశ్చిమగోదావరి, విజయవాడలలో ట్రాఫిక్ స్థంభించిపోయింది. విజయవాడ-ఏలూరు హైవేపై సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.  గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. 

ఇదే ట్రాఫిక్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం ఇరుక్కుపోయారు. సుమారు గంటన్నరపాటు వైఎస్ జగన్ కాన్వాయ్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. ఇక సభ పరిసర ప్రాంతాల్లో అయితే విషయం మామూలుగా లేదు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అయితే 2గంటలుగాపైగా ట్రాపిక్ లో చిక్కుకుపోయారు.  

Last Updated 17, Feb 2019, 10:52 PM IST