నీ స్థానంలో నేనుంటే రైలుకింద తలపెట్టుకునేవాడిని, గాజులు తొడుక్కోలేదు: తలసానిపై మంత్రి అచ్చెన్న ధ్వజం

By Nagaraju penumalaFirst Published 17, Feb 2019, 10:43 PM IST
Highlights

తలసాని స్థానంలో తాను ఉంటే రైలుకింద తలపెట్టుకుని చనిపోయేవాడినంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్యవర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ బీసీ గర్జన సభకు తెలంగాణ నుంచి జనాన్ని తెచ్చుకున్నారని సిగ్గులేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 

శ్రీకాకుళం: తెలంగాణ మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తలసాని స్థానంలో తాను ఉంటే రైలుకింద తలపెట్టుకుని చనిపోయేవాడినంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్యవర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ బీసీ గర్జన సభకు తెలంగాణ నుంచి జనాన్ని తెచ్చుకున్నారని సిగ్గులేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో బీసీ సభకు తెలంగాణ నుంచి జనం తరలివచ్చారని ఆరోపించారు. ఏపీలో మాట్లాడే అర్హత తలసానికి లేదన్నారు.  తెలంగాణలో తొలగించిన బీసీ కులాల గురించి తలసాని శ్రీనివాస్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తలసాని శ్రీనివాస్ జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు. 

ఖబడ్డార్ తలసాని గాజులు తొడుక్కోలేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ ప్రభుత్వ హయాంలో బీసీలకు టీటీడీ చైర్మన్‌ పదవి ఎప్పుడైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. బీసీల అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలని జగన్‌కు సవాల్ విసిరారు. బీసీలకు ఆర్థిక, సామాజిక స్వాతంత్ర్యం వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ వల్లేనన్నారు. 

ఐదేళ్లలో బీసీలకు రూ. 42వేల కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి అచ్చెన్న తెలిపారు. జ్ఞానభూమి ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నామని, ప్రతి నియోజకవర్గంలో రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఏర్పాటు చేశామమన్నారు. 

అలాగే కార్పొరేషన్లను ఏర్పాటు చేసి రూ. 3వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. బీసీలు టీడీపీతో ఉన్నారనే అక్కసుతోనే జగన్‌ మాట్లాతున్నారంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు బీసీలు గుర్తు వచ్చారా అంటూ వైఎస్ జగన్ ను నిలదీశారు మంత్రి అచ్చెన్నాయుడు. 

Last Updated 17, Feb 2019, 10:43 PM IST