జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ: జగన్

Published : Feb 17, 2019, 06:04 PM IST
జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ: జగన్

సారాంశం

 త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా జంగా కృష్ణమూర్తిని ఎంపిక చేసినట్టుగా వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రకటించారు.  

అమరావతి: త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా జంగా కృష్ణమూర్తిని ఎంపిక చేసినట్టుగా వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రకటించారు.

ఈ నెల 22వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. వైసీపీకి ఒక్క సీటు దక్కనుంది. దీంతో ఈ స్థానానికి వైసీపీ అభ్యర్ధిగా జంగా కృష్ణమూర్తిని ఎంపిక చేశారు.

వైసీపీ బీసీ గర్జన వేదికపై ఎమ్మెల్సీ అభ్యర్ధిగా జంగా కృష్ణమూర్తిని ఎంపిక చేసినట్టుగా జగన్ ప్రకటించారు. బీసీ గర్జనలో తాము అధికారంలోకి వస్తే ఏ రకమైన పథకాలను బీసీలకు  అమలు చేయనున్నామో వైఎస్ జగన్ ప్రకటించారు.

బీసీ గర్జన సభతో పాటు బీసీ సమస్యల అధ్యయన కమిటీలో కీలకంగా వ్యవహరించిన జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడం ద్వారా బీసీ వర్గాలను ఆకట్టుకొనే ప్రయత్నాలకు జగన్ వ్యూహత్మకంగా  అడుగులు వేసినట్టుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్