వర్షాలతో ప్రాణాలు కోల్పోయిన వారికి రూ. 5 లక్షలు, ముంపుకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2 వేలు : సీఎం జగన్

Published : Nov 19, 2021, 01:34 PM IST
వర్షాలతో ప్రాణాలు కోల్పోయిన వారికి రూ. 5 లక్షలు, ముంపుకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2 వేలు : సీఎం జగన్

సారాంశం

భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సిఎం అధికారులతో చర్చించారు. వర్షాల కారణంగా దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన వారికి ఐదు లక్షల రూపాయల పరిహారం వీలైనంత త్వరగా అందించాలని తెలిపారు. వరద సహాయక చర్యలను పర్యవేక్షించడానికి మూడ జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు  సీఎం జగన్. 

అమరావతి :  భారీ వర్షాల కారణంగా ఏపీ లోని పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం,  వైఎస్ఆర్  జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.  భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సిఎం అధికారులతో చర్చించారు. వర్షాల కారణంగా దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన వారికి ఐదు లక్షల రూపాయల పరిహారం వీలైనంత త్వరగా అందించాలని తెలిపారు. 

వరద సహాయక చర్యలను పర్యవేక్షించడానికి మూడ జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు  సీఎం జగన్. నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. వీరు జిల్లాలో నెలకొన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం జగన్కు నివేదిస్తారు. 

 వరద సహాయక చర్యలను పర్యవేక్షించడానికిగానూ నెల్లూరు జిల్లాకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్.. Chittoor Districtకు  మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న,  YSR Districtకు సీనియర్ అధికారి  శశి భూషణ్ కుమార్ ను నియమించారు. వారు ఇప్పటికే చేరుకున్నారని అధికారులు సీఎం jaganకు తెలిపారు.

 ముంపు బాధితులను కూడా వెంటనే  Support Centersకు తరలించాం. వరదల్లో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్ల ద్వారా తరలించే చర్యలు కూడా చేపట్టాం.  సహాయక కార్యక్రమాల్లో ఎక్కడా రాజీ లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలకు అదనంగా నిధులు కూడా ఇచ్చాం. అని అధికారులు సీఎం జగన్కు తెలిపారు.

తర్వాత జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ మాట్లాడారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్  హరి నారాయణ్,  స్పెషల్ ఆఫీసర్  ప్రద్యుమ్న  జిల్లాలోని పరిస్థితులను వివరించారు.  ఈ సందర్భంగా సీఎం జగన్  తిరుపతిలో Flood water నిల్వ ఉండి పోవడానికి కారణాలు పై అధ్యయనం చేయాలని ఆదేశించారు. చెరువుల వల్ల ఇది జరిగిందని అధికారులు తగిన కార్యాచరణ సిద్ధం చేయాలని  బాధితులను ఆదుకోవడంలో ఉదారంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

ముంపుకు గురైన ప్రతి కుటుంబానికి రెండు వేల రూపాయలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందని తెలిపారు బాధితులకు నాణ్యమైన సేవలు అందించాలని.. మంచి భోజనం, తాగు నీరు అందించాలని వర్షాల తరువాత కూడా వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. Tirumala దర్శనానికి వచ్చిన భక్తులకు సహాయం గా నిలవాలని సీఎం జగన్ తెలిపారు. 

చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలో వర్షబీభత్సం... సహాయక చర్యలకోసం ప్రత్యేక అధికారుల నియామకం

రైలు, విమానాలు రద్దు అయిన నేపథ్యంలో వారికి అన్ని రకాలుగా తోడుగా ఉండాలని ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో భక్తులు కిందికి రాకుండా పైనే ఉండాలని  ఆదేశాలు జారీ చేశారు.  కనీసం ఒకటి రెండు రోజుల వరకు వారికి తగిన వసతి సమకూర్చారని తెలిపారు.

TTD officersతో సమన్వయం చేసుకుని యాత్రికులకు సహాయంగా నిలవాలన్నారు. తిరుపతి నగరంలో మున్సిపాలిటీ ఇతర సిబ్బందిని కూడా వినియోగించి పనులు చేపట్టాలని అవసరమైతే ఇతర మున్సిపాలిటీ ల నుంచి  సిబ్బందిని తీసుకుని  ఆపరేషన్ చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.

వర్షాల కారణంగా దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన వారికి ఐదు లక్షల రూపాయల పరిహారం వీలైనంత త్వరగా అందించాలని.. అనంతపురం జిల్లాలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలని.. వచ్చే విపత్తులపై  తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎలాంటి సహాయం కావాలన్నా యుద్ధప్రాతిపదికన సమకూరుస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్