హెచ్చరించినా పట్టించుకోలేదు... తిరుపతి జలదిగ్భందం ప్రభుత్వ వైఫల్యమే: నారా లోకేష్ సీరియస్

By Arun Kumar PFirst Published Nov 19, 2021, 8:56 AM IST
Highlights

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ హెచ్చరించినా  వైసిపి ప్రభుత్వం పట్టించుకోలేదని... అందువల్లే తిరుపతి నగరం జగదిగ్భందం అయ్యిందని నారా లోకేష్ ఆరోపించారు.  

అమరావతి: జగన్ సర్కార్ వైఫల్యంవల్లే ప్రస్తుతం తిరుపతి జలదిగ్భందంలో వుందని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ముందుగానే భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని... దీంతో తిరుపతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ముందస్తుగానే నష్ట నివారణ చర్యలు చేపట్టి ప్రజల్ని అప్రమత్తం చేసివుంటే ఈ పరిస్థితి వుండేది కాదన్నారు nara lokesh.  

ఇప్ప‌టికైనా ఎన్డీఆర్ఎఫ్‌, ఇత‌ర స‌హాయ‌బృందాల‌ను పంపించి tirupati లో ముంపు ముప్పు ఉన్న ప్రాంతాల ప్ర‌జ‌ల్ని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాలని లోకేష్ సూచించారు. tirumala లో భారీ వర్షాల కారణంగా వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న భ‌క్తుల‌కు సాయం అందించాలన్నారు. భారీ వర్షాలు, వరదల్లో చిక్కుకున్న ప్ర‌యాణికుల‌ను గ‌మ్య‌స్థానాల‌కు చేర్చేందుకు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేసారు. 

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం నుండి తిరుపతిలో కుండపోత వర్షం కురిసింది. దీంతో రోడ్లపైకి మోకాల్లోతులో నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది.  

read more  Tirupati Rains: తిరుపతిలో కుండపోత...చెరువులను తలపిస్తున్న రోడ్లు, జలపాతంలా తిరుమల కొండ (వీడియో)

ఇక ప్రముఖ ఆద్యాత్మిక కేంద్రం తిరుమలలో కురుస్తున్న భారీ వర్షం ప్రమాదాలకు దారితీసింది. వెంకటేశ్వర స్వామి వెలిసిన కొండపై ఏకదాటిగా వర్షం కురిసి వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. దీంతో ఘాట్ రోడ్డుతో పాటు నడకమార్గంలో వరదనీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఇవాళ(శుక్రవారం) తిరుమల కొండపైకి వెళ్లే అన్నిమార్గాలను మూసివేస్తున్నట్లు టిటిడి అధికారులు ప్రకటించారు. 

ఏడుకొండలపై కురిసిన వర్షం దిగువకు ప్రవహిస్తుండటంతో కపిలేశ్వర తీర్థం వద్ద జలపాతం ప్రమాదకరంగా మారింది. ఘాట్ రోడ్డులో వెళుతుండగా ఓ వ్యక్తి అదుపుతప్పి వరదనీటి ప్రవాహంలో కొట్టుకోపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   

ఇక శుక్రవారం కూడా భారీ వర్షాలు కునిసే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల  నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్ష ప్రభావిత చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశ నిర్వహించారు. ప్రస్తుతం ఆయా జిల్లాలో వర్షాలు, వరదల పరిస్థితిని తెలుసుకున్న సీఎం జాగ్రత్తలు సూచించారు. 

read more  భారీ వర్షాల కారణంగా తిరుమల ఘాట్ రోడ్లు మూసివేత: టీటీడీ

భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతిలో పరిస్థితులపై చిత్తూరు కలెక్టర్‌తో సీఎం మాట్లాడారు. అవసరమైన చోట్ల వెంటనే సహాయ శిబిరాలను తెరవాలని కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీచేశారు. సహాయ శిబిరాల్లో అన్నిరకాల వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సహాయ శిబిరాల్లో ఉన్నవారికి రూ. వేయి రూపాయల చొప్పున తక్షణ సహాయం అందించాలన్నారు సీఎం ఆదేశించారు. 

భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతిలో సహాయక చర్యలు కోసం సంబంధిత శాఖలన్నీ వెంటనే కార్యాచరణ సిద్ధంచేసుకోవాలని సీఎం ఆదేశించారు. అవసరమైనంతమేరకు సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని, వైద్య, ఆరోగ్య సిబ్బంది కూడా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 
  


 

click me!