స్మార్ట్‌ పోలీసింగ్‌: ఏపీకి ఫస్ట్ ర్యాంక్, తెలంగాణకు సెకండ్ ర్యాంక్

By narsimha lodeFirst Published Nov 18, 2021, 10:10 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాలు  స్మార్ట్ పోలీసింగ్ లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. ఇతర రాష్ట్రాల్లో పోలీసుల కంటే ఈ రెండు రాష్ట్రాలు అత్యుత్తమ సేవలు అందిస్తున్నట్టుగా సర్వేలో తేలింది. 

అమరావతి: స్మార్ట్ పోలీసింగ్‌లో తెలుగు రాష్ట్రాలు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి.ఏపికి నెంబ‌ర్ వ‌న్ ర్యాంక్‌ దక్కింది. తెలంగాణ‌కు రెండో ర్యాంక్‌ లభించింది. ఇండియ‌న్ పోలీస్ ఫౌండేష‌న్ స‌ర్వేలో నివేదికలో Smart policing లో రెండు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలను వెనక్కి నెట్టాయి.స్మార్ట్ పోలీసింగ్ పై దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల‌లో  ఇండియ‌న్ పోలీస్ ఫౌండేష‌న్ స‌ర్వే నిర్వ‌హించింది.2014 డిజిపిల స‌మ్మేళ‌నంలో స్మార్ట్ పోలిసింగ్ ప‌ద్ద‌తుల‌ను పాటించాల‌ని  ప్ర‌ధాన‌మంంత్రి Narendra modi సూచించారు. ప్రధాని పిలుపుకు స్పందించి స్మార్ట్ పోలిసింగ్ నిర్వ‌హిస్తున్న రాష్ట్రాల‌లో ఇండియ‌న్ పోలీస్ ఫౌండేష‌న్ స‌ర్వే నిర్వహించింది. 

ప్ర‌జ‌ల ప‌ట్ల పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై  Ipf స‌ర్వే  నిర్వహించింది.ఫ్రెండ్లీ పోలీసింగ్‌, నిష్ప‌క్ష‌పాత‌, చ‌ట్ట‌బద్ధ‌, పార‌ద‌ర్శ‌క పోలిసింగ్‌, జ‌వాబుదారీత‌నం, ప్ర‌జ‌ల న‌మ్మ‌కం విభాగాల్లో ఏపి నెంబ‌ర్ వ‌న్,  తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. పోలిస్ సెన్సిటివిటి , పోలీసుల ప్ర‌వ‌ర్త‌న‌, అందుబాటులో పోలీసు వ్య‌వ‌స్థ‌,  పోలీసుల స్పంద‌న, టెక్నాల‌జీ ఉప‌యోగం విభాగాల్లో తెలంగాణ‌కు మొద‌టి స్థానం దక్కింది.  ఏపి రెండో స్థానంలో నిలిచింది.

ఇటీవలనే ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ దేశంలోనే సోలీసింగ్, ప్రజా భద్రతలో అత్యుత్తమ పనితీరు పరంగా ఉత్తమ డీజీపీగా ఎంపికయ్యారు.రాష్ట్రంలోనొ పోలీసు బలగాల్లోని వివిధ విభాగాల్లో సాంకేతిక సంస్కరణలు చేపట్టి గుర్తింపు పొందారు. స్కోచ్, ఫిక్కీ, ఎన్‌సిఆర్‌బి అనే మూడు జాతీయ సంస్థల నుండి ఒకే రోజు అవార్డులు అందుకొన్న దేశంలో ఏకైన పోలీస్ శాఖగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ రికార్డు సృష్టించింది. తమ శాఖ అందించిన సేవలకు గాను ఈ అవార్డులు దక్కాయని గౌతం సవాంగ్ చెప్పారు.
 

click me!