తిరుమలలో భారీ వర్షం, పెరిగిన చలి తీవ్రత...భక్తులకు ఇబ్బంది

By Arun Kumar PFirst Published Jan 5, 2021, 1:48 PM IST
Highlights

ఇవాళ(మంగళవారం) ఉదయం నుండి తిరుమలలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది

తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోడానికి తిరుమలకు చేరుకున్న భక్తులు భారీ వర్షంతో తడిసి ముద్దవుతున్నారు. ఇవాళ(మంగళవారం) ఉదయం నుండి తిరుమలలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి చల్లటి గాలులు తోడవడంతో చలితీవ్రత విపతీరంగా పెరిగింది. ఇలా వర్షం, చలిగాలులకు భయపడిపోతున్న శ్రీవారి భక్తులు రూములకే పరిమితమయ్యారు.

ఇటీవల నివర్ తుఫాను ప్రభావం తిరుమలపై బాగా పడింది. దీంతో తిరుమల వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుసింది. బలమైన గాలులు వీయడంతో చెట్లు విరిగిపడ్డాయి. పాపవినాశం ప్రాంతంలో అత్యధికంగా 31 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సమయంలో గోగర్భం డ్యాం వద్ద 25 సెంటిమీటర్లు, ఆకాశగంగ వద్ద 18 సెంటీమీటర్లు, కుమారధార పసుపుధార డ్యాంల వద్ద 15.5 సెంటీమీటర్లు, తిరుమలలో 12.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఈ తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిశాయి. చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుసాయి. తాజాగా మళ్లీ వర్షాలు శ్రీవారి భక్తులను వర్షం ఇబ్బంది పెడతోంది. 

click me!