దూకుడు పెంచిన జనసేనాని.. కన్నబాబును టార్గెట్ చేయనున్న పవన్ కల్యాణ్ !!

By AN TeluguFirst Published Jan 5, 2021, 12:55 PM IST
Highlights

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో పార్టీ బలోపేతంతో పాటూ ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఇటీవల కృష్ణా జిల్లాలో పర్యటించిన జనసేనాని.. ఈసారి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. కృష్ణా టూర్‌లో పవన్ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలను టార్గెట్ చేశారు. తూ.గో. లో ఈసారి కన్నబాబును టార్గెట్ చేస్తారనే చర్చ జరుగుతోంది.

పవన్ కల్యాణ్ ఈ నెల 9న తుని నియోజకవర్గంలోని తొండంగి ప్రాంతంలో ఏర్పాటవుతున్న దివిస్‌ ఫార్మా ప్రభావిత గ్రామాల్లో పర్యటించనున్నారు. దివీస్ ల్యాబ్ కు వ్యతిరేకంగా స్థానికులు చేపడుతున్న ఆందోళనలకు పవన్ కళ్యాణ్ మద్దతు పలకనున్నారు. ఈనెల 9న మధ్యాహ్నం ఒంటిగంటకు పవన్ తుని చేరుకుంటారు. 

అక్కడి నుంచి దివీస్ పరిశ్రమ వల్ల ఎక్కువ ప్రభావితమయ్యే దానవాయిపేట, కొత్తపాక పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తారు. అలాగే ఆందోళన చేస్తున్న స్థానికులను, పోలీస్ లాఠీ ఛార్జ్ లో గాయపడ్డవారిని పవన్ పరామర్శిస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.

ఏపీలో దివీస్ లేబరేటరీస్ వ్యవహారం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా, తొండంగి సమీపంలోని దివీస్ సంస్థ ఏర్పాటు చేయబోతున్న కొత్త యూనిట్ పై అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు అనుమతులిచ్చిన టీడీపీ ఇప్పుడు వ్యతిరేకిస్తోంది. అయితే దివీస్ ల్యాబ్‌ను నిలిపేస్తామన్న అధికార పార్టీ ఆచీతూచీ వ్యవహరిస్తోంది. 

ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తే సముద్ర జలాలు కలుషితమై మత్స్య సంపదకు తీవ్ర నష్టంవాటిల్లే ప్రమాదముందని, భూగర్భ జలాలు కలుషితమైన వ్యవసాయం, జనజీవనానికి ఇబ్బందులెదురవుతాయని స్థానికులు అంటున్నారు. దివీస్‌పై స్థానికులు ఉద్యమం చేయడంతో ప్రభుత్వం స్పందించింది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దివీస్ ప్రతినిథులతో మాట్లాడి సమస్య పరిష్కారంపై ఫోకస్ పెట్టారు. 
 
click me!