ఉత్తమబహుమతులు....ఆ ఆరుగురికేనా?

Published : Mar 09, 2017, 03:30 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
ఉత్తమబహుమతులు....ఆ ఆరుగురికేనా?

సారాంశం

త్వరలో మంత్రివర్గం ప్రక్షాళనంటున్నారు కదా? ఇంకేముంది తమ్ముళ్ళు కూడా రెచ్చిపోతారు చూస్తుండండి.

శాసనసభలో ప్రతిపక్షాన్ని ఎదుర్కొనేందుకు చంద్రబాబునాయుడు తన ఎంఎల్ఏలకు బహుమతులను ఎరగా వేస్తున్నారు. సభలో ఉత్తమ ప్రదర్శన చేసిన ఎంఎల్ఏలకు రోజు 6 బహుమతులు అందచేస్తారట. బహుమతులు ఎవరికి ఇవ్వాలో తేల్చేందుకు ప్రత్యేకంగా ఓ బృందాన్ని కూడా ఏర్పటు చేసారట. ఇంతకీ ఏ అంశాల ప్రాతిపదికగా బహుమతులు ప్రకటిస్తారు? సభలో మంచి ప్రసంగం, ఉత్తమ జోక్యం, ప్రత్యర్ధిపక్షంపై సమయానుకూల సద్విమర్శ, ప్రత్యర్ధిపార్టీ విమర్శలను సమర్ధవంతంగా తిప్పికొట్టటం, మీడియా ముందు బాగా మాట్లాడటం వంటి అంశాల ఆధారంగా బహుమతులుంటాయట.

 

సభలో మంచి ప్రసంగమంటే ఖచ్చితంగా అది చంద్రబాబుకు తప్ప ఇంకోరికి  దక్కే అవకాశం లేదు.  ఉత్తమజోక్యానికి, ప్రత్యర్ధిపార్టీ విమర్శలను తిప్పికొట్టే క్యాటగిరీల్లో మాత్రం బాగా పోటీ ఉంటుంది. అచ్చెన్నాయడు, రావెల కిషోర్ బాబు, గొల్లపల్లి సూర్యారావు, యనమల రామకృష్ణుడు, కవిత, బుచ్చయ్యచౌదరి, కూన రవికుమార్, కాల్వ శ్రీనివాసులు లాంటి వాళ్ళున్నారు. ఇక మీడియాముందు మాట్లాడే క్యాటగిరీలో బొండా ఉమ, బుచ్చయ్యచౌదరి, కవిత, అచ్చెన్నాయడుకు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

 

హోలు మొత్తం మీద అర్ధమవుతున్నదేమంటే, మొదటి రెండు రోజుల సమావేశాల్లో జగన్ ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయని ప్రచారం జరుగుతోంది. దాంతో చంద్రబాబులో ఉలిక్కిపాటు మొదలైంది. ఎలాగైనా సరే జగన్ను నిలువరించకపోతే సభలో, ప్రజలముందు ప్రభుత్వం అభాసుపాలవ్వటం తప్పదని గ్రహించినట్లున్నారు. అందుకే బహుమతుల పేరుతో వైసీపీపై ఎదురుదాడులు చేయాలంటూ ఎంఎల్ఏలకు ఎరవేస్తున్నారు. పైగా త్వరలో మంత్రివర్గం ప్రక్షాళనంటున్నారు కదా? ఇంకేముంది తమ్ముళ్ళు కూడా రెచ్చిపోతారు చూస్తుండండి.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు| Asianet News Telugu
Pemmasani Chandrasekhar Powerful Speech: Atal Bihari Vajpayee 101st Jayanthi | Asianet News Telugu