తీరిక దొరికినప్పుడల్లా తోడల్లుడి నివాసానికి.. విషాదంలో తోట్లవల్లూరు

By sivanagaprasad KodatiFirst Published 29, Aug 2018, 12:39 PM IST
Highlights

నందమూరి హరికృష్ణ చూడటానికి చాలా గంభీరంగా కనిపించినప్పటికీ.. ఆయన కుటుంబసభ్యులతో, బంధువులతో, మిత్రులతో చాలా సన్నిహితంగా మెలిగేవారు

నందమూరి హరికృష్ణ చూడటానికి చాలా గంభీరంగా కనిపించినప్పటికీ.. ఆయన కుటుంబసభ్యులతో, బంధువులతో, మిత్రులతో చాలా సన్నిహితంగా మెలిగేవారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని గరికపర్రులోని తోడల్లుడి నివాసానికి తరచూ వచ్చేవారు.

మనసు బాగోనప్పుడల్లా హైదరాబాద్ నుంచి స్వయంగా కారు నడుపుకుంటూ తోట్లవల్లూరు వచ్చి తోడల్లుడితో గడిపి.. విశ్రాంతి తీసుకునేవారు. ఈ సమయంలో ఉయ్యూరు, తోట్లవల్లూరు మండలాల ప్రజలు ఆయనను కలిసేవారు.

హరికృష్ణ ఆకస్మిక మరణం నేపథ్యంలో పెనమలూరు నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని గరికపర్రు ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు.

హరికృష్ణ కార్ యాక్సిడెంట్.. ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే..

హరికృష్ణ మృతి... చంద్రబాబు కాన్వాయ్ లోనే ఆస్పత్రికి చేరుకున్న తెలంగాణ మంత్రి

రోడ్డు ప్రమాదంలో హరిక్రిష్ణ దుర్మరణం (వీడియో)

పోస్ట్ మార్టం పూర్తి..రేపే అంత్యక్రియలు.. ఎక్కడంటే


 

Last Updated 9, Sep 2018, 12:13 PM IST