MS Dhoni Birthday: ధోనీపై ఆంధ్రుల అభిమానం.. బ‌ర్త్ డే గిఫ్ట్ గా భారీ కౌటౌట్.. ఎన్ని అడుగులో తెలిస్తే షాకే!

Published : Jul 07, 2022, 06:19 AM IST
MS Dhoni Birthday: ధోనీపై ఆంధ్రుల అభిమానం.. బ‌ర్త్ డే గిఫ్ట్ గా భారీ కౌటౌట్.. ఎన్ని అడుగులో తెలిస్తే షాకే!

సారాంశం

Happy Birthday MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(Mahendra Singh Dhoni) గురువారం తన 41వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. అయితే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని విజ‌య‌వాడ‌కు చెందిన త‌న అభిమానులు.. పుట్టిన రోజు సంద‌ర్భంగా 41అడుగుల కటౌట్ ను ఏర్పాటు చేశారు   

Happy Birthday MS Dhoni: మ‌న దేశంలో క్రికెట్‌ను ఓ మ‌తంలా.. తమ అభిమాన క్రికెటర్ల‌ పుట్టినరోజును పండుగలా ఎంతో ఉత్సాహంగా జ‌రుపుకుంటారు వారి అభిమానులు. అందులో భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ఎంఎస్ ధోని పుట్టిన రోజు అంటే.. మామూలుగా ఉండ‌దు. సంబరాలు అంబ‌రాన్ని అంటాల్సిందే.. జూలై 7న టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్‌ఎస్ ధోని  తన 41 పుట్టినరోజు వేడుక‌లు జ‌రుపుకోనున్నారు. 

అయితే..  మిస్టర్ కూల్ త‌న పుట్టిన రోజు వేడుక‌ల‌ను లండ‌న్ లో నిర్వహించుకునేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన త‌న‌ కుటుంబంతో కలిసి లండ‌న్ లో ప‌ర్య‌టిస్తున్నారు. ఇదే క్ర‌మంలో జులై 4న తన మ్యారేజ్ డే గ్రాండ్ గా సెలబ్రేట్   చేసుకున్నాడు.

తెలుగోడి అభిమానం 

తెలుగువారి అభిమాన‌మే వేరు.. అది సినిమా అయినా.. క్రికెట్ అయినా.. చాలా ప్ర‌త్యేకంగా చూస్తారు. త‌మ అభిమాన న‌టుడు( లేదా) క్రీడాకారుల స్పెష‌ల్ డేస్ ను గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేశారు. భారీ ఫెక్సీలు, క‌ట్ అవుట్స్ పెట్టి.. ఘ‌నంగా త‌మ అభిమానాన్నిచాటుకుంటారు. అలాగే.. త‌మ ఫేవ‌రేట్ క్రికెట‌ర్ ధోనిపై కూడా తెలుగు ఫాన్స్.. త‌మ‌ అభిమానాన్ని చాలా ప్ర‌త్యేకంగా చాటుకుంటున్నారు. తమ అభిమాన క్రికెటర్ పుట్టినరోజు జరుపుకునేందుకు అభిమానులు ప్రత్యేక సన్నాహాలు చేసుకుంటున్నారు. 

థాలా పుట్టినరోజు సందర్భంగా.. తెలుగు ధోని అభిమానులు విజయవాడ (ఆంధ్రప్రదేశ్) నందిగామలో 41 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. కటౌట్‌లో ధోని సిగ్నేచర్ హెలికాప్టర్ షాట్ ఆడుతున్న‌ట్టు ప్ర‌త్యేకంగా డిజైన్ చేశారు. ఈ కటౌట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ల‌క్షలాది లైక్స్, వేలాది కామెంట్స్ వ‌చ్చాయి. 

ఈ క‌టౌట్ ను అంబారుపేట గ్రామానికి చెందిన భువన్ చారీ,భారత్, సాయి, సిద్దు,బెనాకర్ సహా మరికొందరు ధోనీ అభిమానులు ఏర్పాటు చేశారు. తమకు ఎంతో ఇష్టమైన క్రికెటర్  ధోనీ పుట్టిన రోజున 41అడుగుల కటౌట్ తో పాటు 41కేజీల కేక్ ను కట్ చేశామ‌ని తెలిపారు. జాతీయ రహదారి పక్కనే ఏర్పాఉట చేయ‌డంతో ధోని @41 కటౌట్ వాహనదారులను ఆకట్టుకుంటుంది.

ధోని క‌టౌట్ పెట్ట‌డం ఇదే తొలిసారి కాదు.. తొలుత‌ 2018లో కేరళలో 35 అడుగులు కౌటౌట్ ను,  చెన్నైలో 30 అడుగుల కటౌట్ ఏర్పాటు చేయగా..తాజాగా ఇప్పుడూ ధోని 41వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో 41 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు.

 

PREV
click me!

Recommended Stories

నేను మారాను నన్ను నమ్మండి అనడం చంద్రబాబు కి అలవాటే: Perni Nani Comments | YCP | Asianet News Telugu
మాస్క్ అడిగితె చంపేస్తారా? Varla Ramaiah Serious Comments on YS Jagan | Viral | Asianet News Telugu