విశాఖ ఉత్సవ్‌లో ఎయిర్ షో రద్దు కేంద్రం పనే: బాబు

Published : Dec 28, 2018, 06:31 PM IST
విశాఖ ఉత్సవ్‌లో ఎయిర్ షో రద్దు కేంద్రం పనే: బాబు

సారాంశం

విశాఖ ఉత్సవ్ లో ఎయిర్‌షో నిర్వహించకుండా కేంద్రం అడ్డుకొందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఉద్దేశ్యపూర్వకంగానే విశాఖ ఉత్సవ్ లో ఎయిర్‌షో ను నిర్వహించకుండా అడ్డుకొన్నారన్నారు.

అమరావతి:విశాఖ ఉత్సవ్ లో ఎయిర్‌షో నిర్వహించకుండా కేంద్రం అడ్డుకొందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఉద్దేశ్యపూర్వకంగానే విశాఖ ఉత్సవ్ లో ఎయిర్‌షో ను నిర్వహించకుండా అడ్డుకొన్నారన్నారు.

శుక్రవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అమరావతిలో  మీడియాతో మాట్లాడారు.విశాఖ ఉత్సవ్‌లో ఎయిర్ షో ట్రైల్స్ తర్వాత రద్దు చేశారని విమర్శించారు.ఇదే అంశంపై టీడీపీ ఎంపీలు కూడ కేంద్రం తీరును తప్పుబట్టారు. కక్ష సాధింపులో భాగంగా ఎయిర్‌ఫోర్స్ విన్యాసాలను ఆపారన్నారు. 

దేశంలో ఏపీ రాష్ట్రం భాగం కాదా అని ఆయన ప్రశ్నించారు. గతంలో కూడ విరాట్ షిప్ విషయంలో కేంద్రం పక్షపాతంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. ఈ షిప్ ను ఏపీకి కేటాయించాలని మూడు ధరఖాస్తు చేస్తే మహారాష్ట్రకు కేటాయించారని టీడీపీ ఎంపీలు ఆరోపించారు.
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే