హైకోర్టు విభజన: సుప్రీంకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్‌

By narsimha lodeFirst Published Dec 28, 2018, 5:06 PM IST
Highlights

ఉమ్మడి హైకోర్టు విభజనపై ఏపీ లాయర్ల అసోసియేషన్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.
 


అమరావతి: ఉమ్మడి హైకోర్టు విభజనపై ఏపీ లాయర్ల అసోసియేషన్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.

ఉమ్మడి హైకోర్టు విభజనపై ఏపీ లాయర్ల అసోసియేషన్ సీరియస్ అయింది.శుక్రవారం నాడు ఏపీ లాయర్ల అసోసియేషన్ హైద్రాబాద్ లో జరిగింది.ఈ సమావేశంలో వాడీ వేడీగా చర్చ సాగింది.

ఉమ్మడి హైకోర్టు విభజన నోటీఫికేషన్ పై శనివారం నాడు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఏపీ లాయర్ల అసోసియేషన్ నిర్ణయం తీసుకొంది.
శనివారం నాడు సుప్రీంకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేయాలని న్యాయవాదులు నిర్ణయం తీసుకొన్నారు.

హైకోర్టు విభజనపై ఏపీ లాయర్ల అసోసియేషన్  ప్రతినిధులు ఏపీ హైకోర్టు  తాత్కాలిక చీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ ను కలిశారు. లాయర్లకు ప్రవీణ్ కుమార్ సర్ధిచెప్పారు. రెండు బస్సుల్లో న్యాయ సిబ్బంది, అధికారులు విజయవాడకు బయలు దేరారు.

అమరావతిలో ఏపీ హైకోర్టు నిర్వహణకు గాను  సరైన వసతులు లేని పరిస్థితులు ఉన్నాయని  ఏపీ లాయర్ల అసోసియేషన్ అధ్యక్షుడు రామన్నదొర అభిప్రాయపడుతున్నారు. శాశ్వత భవనం లేని కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆయన చెప్పారు.

హైకోర్టు విభజనకు తాము వ్యతిరేకం కాదన్నారు. కానీ, కనీసం తమకు వసతులు కల్పించిన తర్వాత హైకోర్టు విభజన చేస్తే అభ్యంతరం లేదన్నారు. జనవరి 1వ తేదీ నాటికి హైకోర్టును నడిపించాలని భావిస్తున్నారు.అయితే న్యాయవాదులకు ఎలాంటి వసతులు కల్పించలేదన్నారు.

 

సంబంధిత వార్తలు

ఏపీ హైకోర్టు సీజేగా ప్రవీణ్‌కుమార్: నేపథ్యమిదీ
హైకోర్టు విభజనకు మోక్షం: కేంద్రం నోటిఫికేషన్ జారీ

click me!