టిడిపిలో సగంమంది ఎంఎల్ఏలకు షాక్

First Published May 4, 2017, 2:18 AM IST
Highlights

ఎంఎల్ఏలు, మంత్రుల పనితీరుపై చంద్రబాబు ఎప్పటికప్పుడు చేయించుకుంటున్న సర్వేల్లో ఈ విషయాలు స్పష్టమైంది. ఇదే విషయాన్ని చంద్రబాబు పలుమార్లు స్పష్టం కూడా చేసారు. ఇటువంటి పరిస్ధితిల్లో సిట్టింగ్ లకే తిరిగి టిక్కెట్లు కేటాయిస్తే ఓటమి ఖాయమని చంద్రబాబుకు అర్ధమైపోయింది.

వచ్చే ఎన్నికల్లో సంగంమంది ఎంఎల్ఏలకు చంద్రబాబునాయుడు షాక్ ఇవ్వనున్నారా? పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అదే అనుమానం వస్తోంది. పలువురు ఎంఎల్ఏలపై అవినీతి ఆరోపణలు తదితరాల వల్ల జనాల్లో బాగా వ్యతిరేకత ఉందన్నది వాస్తవం. ఎంఎల్ఏలు, మంత్రుల పనితీరుపై చంద్రబాబు ఎప్పటికప్పుడు చేయించుకుంటున్న సర్వేల్లో ఈ విషయాలు స్పష్టమైంది. ఇదే విషయాన్ని చంద్రబాబు పలుమార్లు స్పష్టం కూడా చేసారు. ఇటువంటి పరిస్ధితిల్లో సిట్టింగ్ లకే తిరిగి టిక్కెట్లు కేటాయిస్తే ఓటమి ఖాయమని చంద్రబాబుకు అర్ధమైపోయింది.

అవినీతి ఆరోపణలతో పాటు పనితీరు సరిగా లేని, పార్టీ క్యాడర్ తో పాటు జనాలకు అందుబాటులో ఉండని వారికీ టిక్కట్లలో కోత ఖాయంగా తెలుస్తోంది. ఇటీవల చిత్తూరు జిల్లా ఎంఎల్ఏలు, నియోజకవర్గాల ఇన్ ఛార్జిల పనితీరుపై జరిపిన సమీక్షలో చంద్రబాబు ఈ విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇన్ఛార్జిల్లో పలువురికి టిక్కెట్లు కష్టమన్న సూచన కూడా చేసారు. అంటే వచ్చే ఎన్నికల్లో దూరం పెట్టాల్సిన వారిని గుర్తించటమన్నది చిత్తూరు జిల్లా నుండే మొదలైందన్నమాట.

వైసీపీకి బాగా పట్టున్న రాయలసీమ జిల్లాల్లో ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకునే స్ధితిలో చంద్రబాబు లేరు. అందుకని ప్రతీ నియోజకవర్గాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవటం ఎంత ముఖ్యమో చంద్రబాబుకే బాగా తెలుసు. అందుకనే గెలుపు విషయంలో ఏ ఒక్క అంశాన్ని కూడా లైట్ గా తీసుకోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు.

కడపలోని 10 అసెంబ్లీల్లోనూ పార్టీ పరిస్ధితి బాగా లేదు కాబట్టే ప్రత్యేక దృష్టి సారించారు. ఎలాగైనా సరే తక్కువలో తక్కువ 5 సీట్లలో గెలవాలన్నది చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. అనంతపురం జిల్లాలో పరిస్ధితీ చాలా ఘోరంగా ఉంది. పోయిన ఎన్నికల్లో 14 సీట్లలో టిడిపి 12 గెలిచింది. వచ్చే ఎన్నికల్లో సీట్ల సంఖ్య తిరగబడుతుందా అన్నట్లుంది పరిస్ధితి. అందుకనే కనీసం సగమన్నా గెలవాలని పట్టుదలతో ఉన్నారు.

ఇక, కర్నూలు జిల్లాలో కూడా మెజారిటీ స్ధానాలు గెలవాలన్నది లక్ష్యం. రాయలసీమలోని మొత్తం 53 సీట్లలో కనీసం 35 స్ధానాల్లో గెలిచేందుకు అవసరమైన వ్యూహాన్ని చంద్రబాబు సిద్ధం చేసుకుంటున్నారు.

ఇక, ఉత్తరాంధ్రలోని 34 సీట్లలో 25 సీట్లు గెలిచే విషయమై యోచిస్తున్నారు. కోస్తా జిల్లాల్లోని 115 స్ధానాల్లో పార్టీ బలంగా ఉంది కాబట్టి మెజారిటీ స్ధానాల్లో టిడిపినే గెలుస్తుందనుకుంటున్నారు. కాకపోతే సగం నియోజకవర్గాల్లో అభ్యర్ధులను మారిస్తే సరిపోతుందని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం.

click me!