వైజాగ్ లో పందులు పట్టుకోవడానికి చెన్నై టీమ్..!

Published : Jul 16, 2021, 09:46 AM IST
వైజాగ్ లో పందులు పట్టుకోవడానికి చెన్నై టీమ్..!

సారాంశం

ఓ మహిళ నేతృత్వంలోని ఈ బృందం దాదాపు వారం రోజుల్లో పందులన్నింటినీ పట్టుకోనున్నారని జీవీఎంసీ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ కిశోర్ తెలిపారు.  

గ్రేటర్ విశాఖ పరిధిలో పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. దీంతో.. వాటిని పట్టుకునేందుకు జీవీఎంసీ( గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్) అధికారులు ప్రత్యేకంగా చెన్నై నుంచి ఓ బృందాన్ని రప్పించారు. ఆ టీమ్ లో దాదాపు 70మంది సభ్యులు ఉండటం గమనార్హం.

వీరంతా వారం రోజులపాటు విశాఖలోనే ఉంటూ.. ఆ పందులన్నింటినీ పట్టుకోనున్నారు. ఓ మహిళ నేతృత్వంలోని ఈ బృందం దాదాపు వారం రోజుల్లో పందులన్నింటినీ పట్టుకోనున్నారని జీవీఎంసీ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ కిశోర్ తెలిపారు.

నగరంలో పందుల సంచారం ఎక్కువగా పెరిగిపోయిందని.. అవి తెగ ఇబ్బందులు పెడుతున్నాయంటూ స్థానికులు.. అధికారులకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఈ ఫిర్యాదులు ఎక్కువ కావడంతో..  ఏయే ప్రాంతాల్లో ఎక్కువ పందులు ఉన్నాయో తెలుసుకునేందుకు అధికారులు 20 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

అనంతరం చెన్నై టీమ్ ని పిలిపించామని.. వారి సహాయంతో ఈ పందులన్నింటినీ పట్టుకోనున్నట్లు ఆయన చెప్పారు.  మొత్తం 942 పందులు ఉన్నట్లు గుర్తించామని.. రోజుకి వంద పందులనైనా పట్టుకోవాలని ఆయన అన్నారు.

PREV
click me!

Recommended Stories

PMMVY Scheme : తెలుగు మహిళలకు బంపరాఫర్.. ప్రభుత్వమే ఫ్రీగా రూ.6,000 అకౌంట్లో వేసే సూపర్ స్కీమ్
Heavy Rain Alert : తెలుగు ప్రజలారా కాస్కొండి.. ఇక భారీ వర్షాలు షురూ, ఈ జిల్లాలకు అలర్ట్ జారీ