విరిగిపడ్డ కొండచరియలు.. కులూమనాలిలో చిక్కుకుపోయిన విశాఖ కార్పొరేటర్లు..

By Sumanth KanukulaFirst Published Aug 20, 2022, 10:02 AM IST
Highlights

స్టడీ టూర్ నిమిత్తం ఉత్తర భారత దేశంలోని మున్సిపాలిటీల్లో పర్యటనకు వెళ్లిన పలువురు జీవీఎంసీ కార్పొరేటర్లు కులూమనాలిలో చిక్కుకుపోయారు. మనాలిలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో స్టడీ టూర్ కోసం వెళ్లిన కార్పొరేటర్లు అక్కడ చిక్కుకుపోవాల్సి వచ్చింది.

స్టడీ టూర్ నిమిత్తం ఉత్తర భారత దేశంలోని మున్సిపాలిటీల్లో పర్యటనకు వెళ్లిన పలువురు జీవీఎంసీ కార్పొరేటర్లు కులూమనాలిలో చిక్కుకుపోయారు. మనాలిలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో స్టడీ టూర్ కోసం వెళ్లిన కార్పొరేటర్లు అక్కడ చిక్కుకుపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం వారు ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వివరాలు.. కుటుంబ సభ్యులతో కలిసి పలువురు కార్పొరేటర్లు ఇటీవల స్టడీ టూర్‌కు వెళ్లారు. కులు మున్సిపాలిటీలో పలు ప్రాంతాలను కార్పొరేటర్లు సందర్శించారు. 

అనంతరం కొందరు కార్పొరేట్లరు మనాలిలో ఉండగా.. మరికొందరు గత రాత్రి మనాలి నుంచి చండీగఢ్‌కు బయలుదేరారు. ఆ మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో అక్కడ ట్రాఫిక్ స్తంభించింది. వారు ఏటూ వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో గత రాత్రి నుంచి కార్పొరేటర్లు, వారి కుటుంబ సభ్యులు, అధికారులు రోడ్డు మీదే కాలం గడుపుతున్నారు. ప్రస్తుతం కార్పొరేటర్లు చండీగఢ్‌కు 170 కి.మీ దూరంలో చిక్కుకుపోయారు. 

ఇక, సహాయక చర్యలు చేపట్టేందుకు ఆర్మీ, ఇతర సిబ్బంది రంగంలోకి దిగింది. అయితే వర్షం పడుతుండటంతో సహాయక చర్యలకు వాతావరణం అనుకూలించడం లేదు. అయితే ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి మరో రెండు రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా కార్పొరేటర్లు చెబుతున్నారు. 

click me!