
గురజాల : పాదయాత్రపై పేటెంట్ వైఎస్ కుటుంబానిదేనని వైసిపి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో నడిస్తూ ఆయన బిడ్డలు జగన్, షర్మిల పాదయాత్ర చేసారని గుర్తుచేసారు. వైఎస్సార్ ఆనాడు మగాడిలాగ, మొనగాడిలాగ పాదయాత్ర చేసారని... వైఎస్ జగన్ కూడా సుధీర్ఘ పాదయాత్ర చేసారన్నారు. వైఎస్ కుటుంబం పాదయాత్రను లోకేష్ కాపీ కొట్టారని ఎమ్మెల్యే కాసు పేర్కొన్నారు.
తన తండ్రి చంద్రబాబు నాయుడు చేసే రాజకీయాల వల్ల ఫలితంలేదని తెలిసే నారా లోకేష్ పాదయాత్ర చేపట్టారని కాసు మహేష్ రెడ్డి అన్నారు. చంద్రబాబు విజన్, రాజకీయాలు తప్పని మెమ్మెమ్మా తుత్తుతూ మాలోకం లోకేష్ ఇప్పటికి తెలుసుకున్నారని అన్నారు. ఇలా వైఎస్ కుటుంబసభ్యుల పాదయాత్రను కాఫీకొట్టినా టిడిపిని గెలిపించుకోవడం లోకేష్ వల్ల కాదన్నారు.
వీడియో
దాచేపల్లి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన బూత్ లెవెల్ ఏజెంట్ల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే కాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువగళం పాదయాత్రలో భాగంగా పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో పర్యటించిన లోకేష్ చేసిన అభివృద్ది వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కౌంటరిచ్చారు. లోకేష్ చెప్పినట్లు టిడిపి హయాంలో నూ.2020 కోట్లతో గురజాలలో అభివృద్ది పనులు జరిగినట్లు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాదు రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎమ్మెల్యే ఛాలెంజ్ చేసారు.
Read More లోకేష్ ఇంటిపేరు నారా కంటే సారానే సరిపోతుంది..: ఎమ్మెల్యే కాసు ఎద్దేవా (వీడియో)
గత ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గురజాలకు భారీగా నిధులుతెచ్చి కమ్యూనిటీ భవనాలు, అంగన్వాడి సెంటర్లు, సిసి రోడ్లు నిర్మించి అభివృద్ది పనులు చేసారన్న లోకేష్ మాటలను ఎమ్మెల్యే కాసు గుర్తుచేసారు. టిడిపి ప్రభుత్వంలో గురజాలలో జరిగిన అభివృద్దిపై చర్చకు తాను సిద్దంగా వున్నానని... చివరకు టిడిపి కేంద్ర కార్యాలయంలో చర్చకు రమన్నా వస్తానన్నారు. లేదంటే టిడిపి నాయకులతోనే గురజాల అభివృద్దిపై ఎంక్వయిరీ వేయించండి... ఆ దమ్ముందా లోకేష్ అని వైసిపి ఎమ్మెల్యే నిలదీసారు.
యరపతినేని ఎమ్మెల్యేగా వుండగా గురజాలను దోచుకున్నాడని... అభివృద్ది అంతా వైసిపి హయాంలోనే జరుగుతోందని కాసు మహేష్ పేర్కొన్నారు. ఒకవేళ టిడిపి ప్రభుత్వ హయాంలోనే రే.2020 కోట్ల నిధులతో అభివృద్ది చేసారని నిరూపిస్తే తానే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని వైసిపి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు.