
గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైఎస్సార్ పార్టీ (YSRCP) కి షాక్ తగిలింది. గుంటూరు జిల్లా (guntur district) దుర్గిలో మాజీ సీఎం, టిడిపి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (NTR) విగ్రహ ధ్వంసానికి వైసిపి నాయకుడు యత్నించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టిడిపి (tdp) శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం ఘటనను అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు తప్పుబడుతున్నారు. అయితే గుంటూరు జిల్లాకు చెందిన ఓ వైసిపి నాయకుడొకరు ఈ ఘటన తననూ తీవ్రంగా కలచివేసిందంటూ పార్టీతో పాటు పదవికి కూడా రాజీనామా చేసాడు.
గుంటూరు పార్లమెంటరీ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి కొలికపూడి ఉమామహేశ్వరరావు (బుజ్జి) తన పదవితో పాటు వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసారు. ఆదివారం గుంటూరు జిల్లాలోని దుర్గి (durgi) మండలకేంద్రంలో పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయటం తనను తీవ్రంగా కలచివేసిందని బుజ్జి పేర్కొన్నారు. దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి (ysr)తో పాటు వంగవీటి మోహనరంగా (vangaveeti ranga), ఎన్టీఆర్ వంటి మహనీయులను ప్రతిఒక్కరం గౌరవించుకుంటామన్నారు.
Video
అయితే ఎన్టీఆర్ విగ్రహంపై ఆదివారం జరిగిన దాడిని ఖండించాల్సిన అవసరం వుందన్నారు. అలాంటి మహనీయుల విగ్రహాలపై దాడులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. అందువల్లే దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహంపై జరిగిన దాడికి నిరసనగా వైసిపికి, పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఉమా వెల్లడించారు.
read more విగ్రహాల ధ్వంసంతో వైసీపీ పతనాన్ని కొని తెచ్చుకుంటోంది.. నారా లోకేష్...
అంతేకాకుండా తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (undavalli sridevi) రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ (BR Ambedkar) గురించి చేసిన వ్యాఖ్యలు కూడా తన రాజీనామాకు మరో కారణమన్నారు. ప్రపంచ మాదిగల నాల్గవ మహాగర్జన సందర్భంగా వైసిపి ఎమ్మెల్యే శ్రీదేవి తమ దేవుడు అంబేద్కర్ ని ఉద్దేశించి మాట్లాడిన తీరు చాలా బాధాకరమన్నారు. డాక్టర్ అంబేద్కర్ తో పాటు బాబు జగజ్జీవన్ రావు ఇద్దరూ మాకు రెండు కళ్ళు.. అలాంటిది ఒకరిని పొగుడుతూ మరొకరిని కించపర్చుతూ సాగిన ఎమ్మెల్యే మాటలు తమను తీవ్రంగా కలచివేసాయన్నారు.
అలాగే ఎమ్మెల్యేగా శ్రీదేవి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరనుండి ఇప్పటివరకు తాటికొండ నియోజకవర్గ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని ఉమా ఆరోపించారు. పార్టీని వెన్నంటి నడిపించిన వారికి పదవులు ఇచ్చే క్రమంలోనూ అన్యాయంగా వ్యవహరించారు. వైసిపి అధికారంలోకి తీసుకురావడానికి అహర్నిశలు పోరాడిన వారికి కాకుండా ఇతరులకు నామినేటెడ్ పదవులు ఇచ్చారని... ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ఇలా ఎమ్మెల్యే శ్రీదేవి వ్యవహారతీరు కూడా తన రాజీనామాకు కారణమని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.
read more NTR Statue: దుర్గిలో తీవ్ర ఉద్రిక్తత, 144సెక్షన్... టిడిపి నాయకుడు చదలవాడ హౌస్ అరెస్ట్ (Video)
ఇక జగన్మోహన్ రెడ్డి (ys jagan) ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో కలలు కన్నామని... రాజన్న రాజ్యం తీసుకు వస్తాడని ఎదురు చూశామని అన్నారు. అయితే రాజన్న రాజ్యం అటుంచి రాజధానిని అమరావతి నుండి తరలించాలన్న నిర్ణయం తనకు తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. అందువల్లే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, గుంటూరు పార్లమెంటరీ పార్లమెంటరీ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసినట్లు కొలికపూడి ఉమామహేశ్వరరావు వెల్లడించారు.