అనూష హత్య ఎలా జరిగిందంటే...: ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడి

By Arun Kumar P  |  First Published Feb 26, 2021, 2:35 PM IST

నరసరావుపేట డిగ్రీ విద్యార్థిణి హత్యకు సంబంధించిన వివరాలను తాజాగా గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు.  


గుంటూరు జిల్లా నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని అనూషను సహవిద్యార్థి విష్ణువర్ధన్ రెడ్డి  అతి కిరాతకంగా హతమార్చడం రాష్ట్రవ్యాప్లంగా సంచలన రేపింది. ఈ హత్యకు సంబంధించిన వివరాలను తాజాగా గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు.  

''డిగ్రీ విద్యార్థిని అనూషను సహ విద్యార్థి విష్ణువర్ధన్ రెడ్డి గొంతునులిమి హత్య చేశాడు. ఇది చాలా దారుణ, బాధాకరమైన విషయం. అందుకే కేసు విచారణ త్వరితగతిన చేపట్టాం. అనూషకు ఆమె కమ్యూనిటీకి చెందిన వేరే యువకునితో చనువుగా ఉందని విష్ణుకి అనుమానం వచ్చింది. అందుకే 24 వ తేదీ ఉదయం అనూషను నరసరావుపేట శివారులోని పాలపడు ప్రాంతానికి తీసుకెళ్లాడు. అనూషతో అక్కడ గొడవపడి  యువకుడి గురించి నిలదీయటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ కోపంలో విష్ణువర్ధన్అనూషను గొంతు నులిమి చంపాడు'' అని ఎస్పీ తెలిపారు.

Latest Videos

read more నరసరావుపేట ఘటనపై జగన్ ఆరా: అనూష కుటుంబానికి చేయూత.. 10 లక్షల సాయం

''హత్య తర్వాత సాక్ష్యాదారాలు లేకుండా చేయాలని రెండు చేతులతో శవాన్ని మోసుకొని వెళ్లి మేజర్ కాల్వలో  వేసాడు. అయితే ఈ హత్యకు సంబంధించి ఆధారాలు శాస్త్రీయంగా సేకరించాం. హత్య కేసులో ముద్దాయికి శిక్ష పడేలా చూస్తాం. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని కోర్టును కోరతాం'' అని ఎస్పీ పేర్కొన్నారు. 

''మహిళలు, యువతులు ఇలాంటి సమస్య ఉంటే పోలీసులను సంప్రదించాలి. నా వాట్సప్ నంబర్ 9440796200 కు కూడా ఫిర్యాదు చేయొచ్చు. పోలీసు హెల్ప్ లైన్ వాట్సాప్ నెంబరు 8866268899 ఏ సమస్య వచ్చిన వాట్సాప్ లో మెసేజ్ చేస్తే స్పందిస్తాం. అనూష కేసుని నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను.  పూర్తి స్థాయి లో విచారణ కొనసాగుతోంది'' అని ఎస్పీ విశాల్ గున్నీ స్పష్టం చేశారు. 

click me!