కోటప్పకొండ: ప్రభలపై నిషేధం లేదు.. ప్రజలకు క్లారిటీ ఇచ్చిన జిల్లా ఎస్పీ

By Siva KodatiFirst Published Feb 28, 2021, 5:54 PM IST
Highlights

మహా శివరాత్రిని పురస్కరించుకుని నరసరావుపేటలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ తిరునాళ్లలో ప్రభల వ్యవహారం రాజకీయంగా దుమారం రేగిన సంగతి తెలిసిందే. కోవిడ్ నిబంధనల పేరిట ప్రభలపై అధికారులు నిషేధం విధించినట్లుగా వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ స్పందించారు. ప్రభలపై ఎలాంటి నిషేధం విధించలేదని గున్నీ స్పష్టం చేశారు. గుంటూరులో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు.

ప్రభల ఏర్పాటు అనుమతిపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. ఏటా సంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేసే ప్రభలపై ఆంక్షలు విధించలేదని ఎస్పీ వెల్లడించారు.

ఎన్నికల వేళ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు చేపట్టాలని.. అలాగే కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ప్రజలు తిరునాళ్లు జరుపుకోవచ్చని విశాల్ గున్నీ స్పష్టం చేశారు. మతపరమైన విషయాలకు సంబంధించి ఊహాగానాలను ప్రచారం చేయవద్దని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు.  

click me!