
గుంటూరు: పోలీస్ వాహనం ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన గుంటూరు జిల్లా (guntur ditrict)లో జరిగింది. పోలీస్ జీప్-బైక్ మంచి స్పీడ్ లో వుండగా ఢీకొనడంపై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ పై వున్న ఇద్దరిలో ఒకరు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నరసరావుపేట (narasaraopet) వరదకట్ట ప్రాంతానికి చెందిన షేక్ రెహమాన్(25) అనే యువకుడు నకరికల్లు మండలం గుళ్లపల్లిలోని బంధువుల ఇంటికి మరొకరితో కలిసి బైక్ పై బయలుదేరాడు.ఇదే సమయంలో నరసరావుపేట నుండి నకరికల్లు (nakarikallu) వైపు వెళ్తున్న పోలీస్ వాహనం అడ్డ రోడ్డు సమీపంలో వీరి బైక్ ను ఢీకొట్టింది.
బాగా స్పీడ్ లో వుండగా పోలీస్ జీప్- బైక్ ఢీకొన్నాయి. దీంతో పోలీస్ వాహనం (police vehicle) ఢీకోట్టగానే బైక్ పై వున్న రెహమాన్ ఎగిరి రోడ్డుపై పడ్డట్లున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో రెహమన్ అక్కడిక్కడే మృతిచెందాడు. బైక్ పై వున్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రమాదం జరిగిన వెంటనే వాహనంలోని పోలీసులు గాయపడిన వ్యక్తిని 108అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు. మృతదేహాన్ని కూడా పోస్టు మార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న మృతుడి కుటుంసభ్యులు, బంధువులు హాస్పిటల్ వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. హాస్పిటల్ వద్దకు రెహమాన్ బంధువులు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.
మృతుడు రెహమాన్ నరసరావుపేట పట్టణంలోని ఓ వైన్ షాప్ లో పనిచేస్తూ కుటుంబానికి అండగా వుండేవాడు. అతడి మృతి కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశముంది కాబట్టి ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
read more Guntur Accident: రోడ్డుపక్కన నిద్రిస్తున్న వృద్దురాలి పైనుండి దూసుకెళ్ళిన కారు
ఇదిలావుంటే నెల్లూరు జిల్లా (nellore district)లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆత్మకూరుకు చెందిన కొందరు సంగంలోని శివాలయానికి ఆటోలో బయలుదేరారు. ఇలా 12మందితో వెళుతున్న ఆటోను ఎదురుగా మితిమీరిన వేగంతో వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో అమాంతం ఎగిరి వాగులో పడిపోయింది. వెంటనే రహదారిపై వెళ్తున్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టి ఏడుగురిని వాగులోంచి కాపాడారు. కానీ ఐదుగురు మాత్రం నీటిలో కొట్టుకుపోయి మరణించారు.
ఈ ప్రమాదం నుండి కర్రా కృష్ణకుమారి(33), కర్రా లక్ష్మీదేవి(35), కర్రా నవదీప్(9), కర్రా నాగభూషణం(40) ఆటో డ్రైవర్, కర్రా నాగసాయి(15), కర్రా నందు(19) క్షేమంగా బయటపడ్డారు. కానీ కర్రా నాగవల్లి (14), కర్రా సంపూర్ణ (45), కర్రా నాగరాజు (35), కర్రా పద్మ (30), దివనపు ఆదెమ్మ (60), కర్రా పుల్లయ్య (50) మృతిచెందారు.